హెయిర్ ఫాల్ వెంటనే స్టాప్ అవ్వాలా.. అయితే ఇలా చేయండి!
TeluguStop.com
హెయిర్ ఫాల్( Hair Fall ) అనేది అత్యంత సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఒకటి.
అయితే అందరిలోనూ హెయిర్ ఫాల్ అనేది ఒకే విధంగా ఉండదు.కొందరిలో చాలా నార్మల్ గా హెయిర్ ఫాల్ ఉంటే.
కొందరిలో మాత్రం హెవీ గా ఉంటుంది.రెండో క్యాటగిరిలో మీరు ఉన్నారా.
? జుట్టు అధికంగా ఊడిపోతుందా.? రోజురోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.
? వెంటనే హెయిర్ ఫాల్ స్టాప్ అవ్వాలా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని కచ్చితంగా ఫాలో అవ్వండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి దాదాపు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించండి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉడికించి చల్లారబెట్టుకున్న అవిసె గింజలను వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ( Curd )మరియు వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె( Mustard Oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/" /
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే హెయిర్ ఫాల్ అన్న మాటే అనరు.
అవిసె గింజల్లో ఉండే విటమిన్స్, మినరల్స్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తాయి.జుట్టు రాలడాన్ని అరికడతాయి.
"""/" /
అదే సమయంలో హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.అలాగే పెరుగు మరియు ఆవనూనె కూడా హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టడంలో సహాయపడతాయి.
కురులు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాబట్టి హెయిర్ ఫాల్ సమస్యను వేగంగా వదిలించుకోవాలని భావించేవారు తప్పకుండా పైన చెప్పిన రెమెడీని ఫాలో అవ్వండి.
సినిమా విడుదలని నిర్ణయిస్తున్న ఓటిటి సంస్థలు.. గతి తప్పితే కష్టమే !