ఈ ఇంటి చిట్కాను పాటిస్తే ఇక చుండ్రుతో దిగులే ఉండదు!
TeluguStop.com
చుండ్రు (dandruff)అనేది చాలా సర్వసాధారణంగా వేధించే సమస్య.కొందరిలో చుండ్రు హెవీగా ఉంటుంది.
దీని కారణంగా తలలో దురద, చిరాకు, వెంట్రుకలు బలహీనపడటం, డ్రై హెయిర్ (Itching, Irritation, Hair Loss, Dry Hair)తదితర సమస్యలన్నీ ఇబ్బంది పెడుతుంటాయి.
ఈ క్రమంలోనే చుండ్రును నివారించుకునేందుకు ఎంతో ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.అయినా కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటే అస్సలు దిగులు చెందకండి.
ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే చుండ్రును శాశ్వతంగా వదిలించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం చుండ్రు సమస్యకు చెక్ పెట్టే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు(Methi Seed) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకుని అందులో 10 వరకు వేపాకులు(Neem Leaves), 2 రెబ్బలు కరివేపాకు(Curry Leaves), రెండు మందారం ఆకులు, నాలుగు తులసి ఆకులు వేసుకోవాలి.
వీటితో పాటు నైట్ అంతా నానబెట్టుకున్న మెంతులను వాటర్ తో సహా వేసుకుని అన్నిటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసి మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరలించాలి.
40 నిమిషాలు లేదా గంట అనంతరం యాంటీ డాండ్రఫ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించారంటే చుండ్రు అన్న మాటే అనరు.
"""/" /
వేపాకు, తులసి, కరివేపాకు, మందారం ఆకు, మెంతులు, ఆవనూనె ఇవన్నీ తల చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తాయి.
స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తాయి.చుండ్రు సమస్యకు సమర్థవంతంగా చెక్ పెడతాయి.
కాబట్టి చుండ్రుతో తీవ్రంగా సతమతం అవుతున్నవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.
పైగా ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల జుట్టు కుదుళ్ళు ఆరోగ్యంగా దృఢంగా మారతాయి.