ముఖం మెడ తెల్లగా అందంగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి!
TeluguStop.com
తమ ముఖం, మెడ తెల్లగా అందంగా మెరిసిపోవాలని చాలా మంది కోరుకుంటారు.ముఖ్యంగా ఆడవారు అటువంటి చర్మాన్ని పొందడం కోసం రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు.
నెలకు ఒకసారి బ్యూటీ పార్లర్ కి వెళ్లి స్కిన్ కోసం వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ ఎటువంటి కెమికల్స్ తో పని లేకుండా సహజంగా అందాన్ని పెంచుకోవచ్చు.చర్మాన్ని తెల్లగా, కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ( Home Remedy ) చాలా చక్కగా వర్కోట్ అవుతుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎనిమిది బాదం గింజలు( Almonds ) వేసి హాట్ వాటర్ పోసి పీల్ ను తొలగించాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో తొక్క తొలగించిన బాదం గింజలు వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం, చిటికెడు కుంకుమ పువ్వు( Saffron Flower ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఈ పౌడర్ లో వాట్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood Powder ) మరియు సరిపడా ఫ్రెష్ బీట్ రూట్ లేదా పొటాటో జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్బింగ్ చేసుకుంటూ వేసుకున్న ప్యాక్ ను తొలగించాలి.
"""/" /
ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే మ్యాజికల్ రిజల్ట్ ను పొందుతారు.
ఈ రెమెడీ స్కిన్ టోన్ ను పెంచుతుంది.చర్మంపై డార్క్ స్పాట్స్ ను తొలగిస్తుంది.
చర్మానికి చక్కని పోషణ అందించి ఆరోగ్యంగా యవ్వనంగా మారుస్తుంది.స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.
ఈ రెమెడీని పాటించడం అలవాటు చేసుకుంటే మీ ముఖం మరియు మెడ తెల్లగా అందంగా మెరిసిపోవడం గ్యారంటీ.
రాజమౌళి మాదిరిగానే గోపీచంద్ మలినేని కూడా మరో పాన్ ఇండియా డైరెక్టర్ అవుతాడా..?