కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే మీ జుట్టు డబుల్ కాదు ట్రిపుల్ అవుతుంది!

మనలో చాలా మంది పల్చటి జుట్టు సమస్యతో బాధపడుతుంటారు.పల్చటి జుట్టు కారణంగా స్త్రీలు ఎటువంటి హెయిర్ స్టైల్స్ వేసుకోవాలన్నా ఇబ్బంది పడుతుంటారు.

మరోవైపు పురుషులు జుట్టు పల్చగా ఉంటే ఏ మాత్రం అట్రాక్టివ్ గా కనిపించలేరు.

అందుకే జుట్టును ఒత్తుగా మార్చుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాల‌న్ని చేస్తుంటారు.ఈ జాబితాలో మీరు ఉన్నారా.

అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే. """/" / అన్నిటిలోనూ కొబ్బరి నూనె( Coconut Oil ) జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

అనేక సమస్యలకు అడ్డుకట్టు వేస్తుంది.అయితే కొబ్బరి నూనెను నేరుగా కాకుండా ఇప్పుడు చెప్పబోయే విధంగా రాస్తే మీ జుట్టు డబుల్ కాదు ట్రిపుల్ అవుతుంది.

అందుకోసం ముందుగా రెండు అంగుళాల అల్లం ముక్క( Ginger )ను తీసుకుని శుభ్రంగా కడిగి పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ కొబ్బరి నూనె పోసుకోవాలి.

"""/" / ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో అల్లం తురుము వేసి చిన్న మంటపై ఉడికించాలి.

దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను ఒక రోజంతా అలాగే వదిలేయాలి.

మరుసటి రోజు స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో నింపుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి బాగా మసాజ్ చేసుకోవాలి.

నెక్స్ట్ డే మార్నింగ్ మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను వాడితే సరిపోతుంది.అల్లం జుట్టు ఎదుగుదలను అద్భుతంగా ప్రోత్సహిస్తుంది.

చుండ్రు సమస్యను నివారిస్తుంది.స్కాల్ప్ ను హెల్తీ గా మారుస్తుంది.

అల్లం వేసి మరిగించిన కొబ్బరి నూనెను వాడటం వల్ల జుట్టుకు ఎంతో మేలు జరుగుతుంది.

పల్చటి జుట్టు ఉన్నవారు ఈ విధంగా కొబ్బరి నూనెను వాడితే కొద్ది రోజుల్లోనే కురులు మూడింతలు అవుతాయి.

హెయిర్ ఫాల్( Hair Fall ) సైతం కంట్రోల్ అవుతుంది.

అనిరుధ్ ప్రాణం పెట్టి దేవర కోసం పని చేశాడా… ఆ బీజీఎంకు గూస్ బంప్స్ అంటూ?