సూపర్ లాంగ్ అండ్ థిక్ హెయిర్ కోసం ఆరాటపడుతున్నారా.. అయితే ఈ రెమెడీ మీ కోసమే!

మగువల్లో చాలా మంది పొడవాటి ఒత్తైన కురులను కోరుకుంటారు.అటువంటి జుట్టును పొందడం కోసం ఖరీదైన షాంపూ, కండిషనర్, ఆయిల్ తో పాటు సీరం వంటి ఉత్పత్తులను కూడా వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు చాలా అంటే చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని కనుక పాటిస్తే సూపర్ లాంగ్ అండ్ థిక్ హెయిర్( Super Long And Thick Hair ) మీ సొంతం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం,( Rice ) వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

వాటర్ జెల్లీగా మారుతుంది.అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ జెల్లీ వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాటర్ చల్లారే లోపు ఒక ఉల్లిపాయను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోండి.

"""/" / ఆ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ ఉల్లిపాయ జ్యూస్ ( Onion Juice )ను ముందుగా తయారు చేసిన వాటర్ లో వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆముదం, నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి .

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

జుట్టు కుదుళ్లు బలోపేతం అవుతాయి.జుట్టు రాలడం తగ్గుతుంది.

ఒత్తుగా పొడుగ్గా పెరుగుతుంది.కాబట్టి లాంగ్ అండ్ థిక్ హెయిర్ ను కోరుకునే వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి.

రైలు డోర్ తెరుచుకోక పోవడంతో చేతికర్రతో పగలగొట్టిన వికలాంగుడు.. చివరకు? (వీడియో)