ఆఫీస్ కి వెళ్లే అమ్మాయిలు మేకప్ అక్కర్లేదు.. ఈ రెమెడీతో సహజంగానే అందంగా మెరిసిపోండి!

అందరిలోనూ తామే అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలి అన్న కోరిక ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.

ముఖ్యంగా ఆఫీస్‌ల‌కు వెళ్లే అమ్మాయిలు ఈ విషయంలో మరింత ఎక్కువగా ఆరాటపడుతుంటారు.ఈ క్రమంలోనే మేకప్( Makeup ) తో మెరుగులు దిద్దుతుంటారు.

కానీ నిత్యం మేకప్ వేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం పాడవుతుంది.భవిష్యత్తులో అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి.

అందుకే సహజంగానే అందంగా కనిపించడానికి ప్రయత్నించాలి.అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీని పాటిస్తే మేకప్ అక్కర్లేదు సహజంగానే అందంగా కాంతివంతంగా మెరిసిపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా రెండు లేదా మూడు కప్పులు నిమ్మ తొక్కలు( Lemon Peels ) వేసుకుని ఎండలో ఎండబెట్టాలి.

బాగా ఎండిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి.

ఇందంతా మేము చెయ్యలేము అనుకునేవారు మార్కెట్లో లెమన్ పీల్ పౌడర్( Lemon Peel Powder ) అందుబాటులో ఉంటుంది.

దాన్ని కూడా తెచ్చుకొని వాడవచ్చు. """/" / ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ లెమన్ పౌడర్‌ను వేసుకోండి.

ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood Powder ), వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe Vera Gel ), వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని జస్ట్ 20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోండి.

"""/" / ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోండి.రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

లెమన్ పీల్ లో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.స్కిన్ యవ్వనంగా కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

చర్మం పై ఎలాంటి మచ్చలు ఉన్నా సరే పోగొడుతుంది.అలాగే చందనం పొడి స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది.

అలోవెరా జెల్, తేనె మరియు రోజ్ వాటర్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.ముడతలను దూరం చేస్తాయి.

ఫైనల్ గా ఈ రెమెడీతో మీరు న్యాచురల్ బ్యూటీ లా మెరిసిపోతారు.

ప్లానింగ్ లో ప్రభాస్ ను మించిన హీరో లేడుగా.. ఈ హీరోకు ఎవరూ సాటిరారుగా!