మేక‌ప్ అక్క‌ర్లేదు.. స‌హ‌జ అందం కోసం ఈ ఇంటి చిట్కాను పాటించండి!

ఈ మధ్యకాలంలో చాలా మంది మేకప్ ను తమ డైలీ రొటీన్ లో భాగం చేసుకుంటున్నారు.

మేకప్ లేనిదే బయట కాలు కూడా వేయడం లేదు.అయితే నిత్యం మేకప్ వేసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం అనేది పాడవుతుంది.

అందుకే సహజ అందాన్ని పెంచుకోవడం చాలా ముఖ్యం.మేకప్ లేకుండా అందంగా మెరిసిపోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కాను అస్సలు మిస్ అవ్వకండి.

ముందుగా మిక్సీ జార్ లో రెండు బంగాళదుంప స్లైసెస్( Potato Slices ), రెండు కీర దోసకాయ స్లైసెస్( Cucumber Slices ) వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు అదే మిక్సీ జార్ లో మూడు టేబుల్ స్పూన్లు ఉడికించిన రైస్, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు, వన్ టీ స్పూన్ తేనె( Honey ), రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్( Vitamin E Oil ) వేసుకోవాలి.

అలాగే పొటాటో కీరా జ్యూస్ కూడా వేసుకుని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు మరియు కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

ఫైనల్ గా చర్మానికి మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.వారానికి కేవలం రెండు సార్లు ఈ ఇంటి చిట్కాను పాటించారంటే రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు.

"""/" / ఈ రెమెడీ సహజ అందాన్ని ప్రోత్సహిస్తుంది.చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చర్మ కణాల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగిస్తుంది.స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తుంది.

అంతేకాకుండా ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.స్కిన్ కలర్ పెరుగుతుంది.

చర్మంపై మచ్చలు ఏమైనా ఉన్నా కూడా క్రమంగా మాయం అవుతాయి.కాబట్టి మేకప్ లేకుండా అందంగా కనిపించాలి అనుకుంటే తప్పకుండా ఈ ఇంటి చిట్కా ను పాటించండి.