ముఖం, మెడ తెల్లగా మెరిసిపోతూ కనిపించాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

సాధారణంగా కొందరికి ముఖం తెల్లగా ఉంటే మెడ మాత్రం నల్లగా ఉంటుంది.అలాగే ఇంకొందరికి మెడ తెల్లగా ఉంటే ముఖం మాత్రం కాస్త రంగు తక్కువగా ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలీక తెగ వర్రీ అయిపోతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ముఖం మెడ రెండు తెల్లగా అందంగా మెరిసిపోతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/"/ ముందుగా చిన్న బంగాళదుంప మరియు బీట్ రూట్ ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్లు చందనం పొడి వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ తేనె తో పాటు బీట్ రూట్ బంగాళదుంప జ్యూస్( Beetroot Potato Juice ) ను కూడా వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ప‌దిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆ తర్వాత చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే స్కిన్ లో చేంజెస్ ను మీరు గమనిస్తారు.

బంగాళదుంపలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి.అందువ‌ల్ల ఇది చ‌ర్మం న‌లుపును పోగొడుతుంది.

"""/"/ అలాగే బీట్ రూట్ మరియు చందనం స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి.

కార్న్ ఫ్లోర్ డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) ను తొలగిస్తుంది.

మరియు తేనె చర్మాన్ని హైడ్రేటెడ్ గా మారుస్తుంది.మచ్చలు ఏమైనా ఉంటే వాటిని క్రమంగా పోగొడుతుంది.

మొత్తంగా ఈ పదార్థాలు అన్నిటినీ కలిపి ప్యాక్ లా వేసుకోవడం వల్ల మీ ముఖం, మెడ తెల్లగా మెరిసిపోతాయి.

అందంగా కాంతివంతంగా కనిపిస్తాయి.

ట్రంప్‌పై హత్యాయత్నం : వెలుగులోకి పోలీస్ అధికారి బాడీ‌కామ్ ఫుటేజ్.. సీక్రెట్ సర్వీస్‌పై విమర్శలు