డార్క్ నెక్ తో డోంట్ వర్రీ.. ఈ రెమెడీతో వారంలో వైట్ గా మార్చుకోండి!

సాధారణంగా కొందరికి మెడ ముదురు రంగులో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే చుట్టుపక్కల చర్మం తో పోలిస్తే మెడ చుట్టూ చర్మం నల్లగా కనిపిస్తుంది.

ఎండల ప్రభావం, పిగ్మెంటేషన్, పలు రకాల మందులు వాడకం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం మాత్రమే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు కూడా మెడ నల్లగా మారడానికి కారణాలు అవుతుంటాయి.

అయితే మెడ నల్లగా ఉండటం వల్ల ముఖం ఎంత తెల్లగా, మృదువుగా ఉన్నా కూడా ఏదో లోపం ఉన్నట్టుగా కనిపిస్తారు.

పైగా మెడలో ఎటువంటి ఆభరణాలు వేసుకున్న అందంగా క‌నిపించ‌వు. """/" / ఈ క్రమంలోనే మెడ నలుపును వదిలించుకునేందుకు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు.

కొందరు వేలకు వేలు ఖర్చుపెట్టి నెక్ వైట్నింగ్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డార్క్ నెక్( Dark Neck ) తో డోంట్ వర్రీ.

ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటిస్తే వారం రోజుల్లో నల్లగా ఉన్న మెడను తెల్లగా మార్చుకోవచ్చు.

"""/" / అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 4 టమాటో స్లైసెస్ మరియు 4 బొప్పాయి పండు ముక్కలు వేసి స్మూత్ ప్యూరీలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు పెసరపిండి, హాఫ్‌ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) వేసుకోవాలి.

చివరిగా సరిపడా టమాటో బొప్పాయి ప్యూరీ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న‌ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

తడిపొడిగా ఉన్నప్పుడే ముని వేళ్ళతో చర్మాన్ని మెల్లమెల్లగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ ప్యాక్ ను తొలగించాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే వారం రోజుల్లోనే మీరు రిజల్ట్ ను గమనిస్తారు.

ఈ రెమెడీ మెడ నలుపును క్రమంగా మాయం చేస్తుంది.మెడ చుట్టూ ఉన్న చర్మాన్ని తెల్లగా మృదువుగా మారుస్తుంది.

మృత క‌ణాల‌ను తొల‌గిస్తుంది.అందమైన మెరిసే మెడను మీ సొంతం చేస్తుంది.

అనుకున్నదే జరిగింది.. T20లో 300 కొట్టేశారు..