అరటి పండు ఆరోగ్యానికే కాదు జుట్టు రాలడాన్ని అరికడుతుంది.. ఎలా వాడాలంటే?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్లలో అరటిపండు ముందు వరుసలో ఉంటుంది.ఏడాది పొడవునా లభించే అరటిపండు అనేక పోషకాలతో లోడ్ చేయబడి ఉంటుంది.

అందువ‌ల్ల రోజుకు ఒక అరటి పండును తింటే బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.

జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, కండరాల నిర్మాణానికి, ఎముకల దృఢత్వానికి, గుండె ఆరోగ్యానికి అరటిపండు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు రాలడాన్ని అరికట్టడానికి కూడా అరటిపండు( Banana ) సహాయపడుతుంది.

అందుకోసం అరటి పండును ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) వేసి ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న మెంతులు వేసుకోవాలి.అలాగే ఒక అరటి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి.

మరియు రెండు మందార ఆకులు, మెంతులు నానబెట్టుకున్న నీటిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె( Coconut Oil ) వేసి మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట తర్వాత మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తలస్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ విధంగా హెయిర్ మాస్క్ ను వేసుకున్నారంటే జుట్టు రాలడం అన్న మాటే ఉండదు.

అరటిపండు, మెంతులు, మందారం ఆకుల్లో ఉండే పోషకాలు జుట్టు కుదుళ్ళను బలోపేతం చేస్తాయి.

జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడతాయి.హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న వారికి ఈ బనానా హెయిర్ మాస్క్ చాలా బాగా సహాయపడుతుంది.

ప్రతివారం ఈ మాస్క్ వేసుకుంటే హెయిర్ ఫాల్ కు శాశ్వతంగా గుడ్ బై చెప్పవచ్చు.

పైగా ఈ మాస్క్ జుట్టును సిల్కీగా మారుస్తుంది.షైనీగా మెరిపిస్తుంది.

డ్రై హెయిర్ సమస్యను సైతం దూరం చేస్తుంది.

మొదటి సినిమా హీరోయిన్ తో పవన్ కళ్యాణ్.. ఫోటో వైరల్!