మీ వయసుకు తగ్గ ఎత్తు లేరని బాధపడుతున్నారా.. ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో చాలామందికి ప్రపంచవ్యాప్తంగా తమ వయసుకు తగ్గ ఎత్తు లేమని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు.

దీనివల్ల నలుగురిలో తిరగలేక డిప్రెషన్ సమస్యకు గురవుతూ ఉంటారు.ఇంకొందమంది ఎత్తును పెంచుకోవడానికి వైద్యుల దగ్గరికి వెళ్లి రకరకాల సర్జరీలు, గ్రోత్ హార్మోన్స్ వంటి ప్రమాదకరమైన మందులను వాడి అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు.

ఆరోగ్యం పై ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం యోగాసనాల ద్వారా శరీర ఎత్తును పెంచుకోవడం సాధ్యమవుతుంది.

శరీర ఎత్తును పెంచుకోవడానికి ప్రతి రోజు కొన్ని నిమిషాల పాటు వృక్షాసనం ను చేస్తే ఎత్తు పెరిగే అవకాశం ఉంది.

ఆ ఆసనాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మొదటగా ప్రశాంతంగా, నిటారుగా నిల్చొని నిదానంగా శ్వాస తీసుకుంటూ కుడి కాలును మీ ఎడమ కాలి వైపుకు మడిచి, ఎడమ కాలు మీద ఉంచాలి.

మీ కుడి పాదం లోపల ఎడమ తోడను తాకించాలి.మీ శరీర బ్యాలెన్సింగ్ కోసం మీ చేతులను పైకి ఎత్తి సూర్య నమస్కారం చేయాలి.

ముఖ్యంగా మోచేతులు వంగకుండా చూసుకొని కొన్ని సెకండ్ల పాటు ఆసనం వేస్తే ఈ శరీరంలో ఉన్న గ్రోత్ హార్మోన్ పనితీరు మెరుగుపడి శరీర ఎత్తు పెరిగే అవకాశం ఉంది.

ఈ ఆసనాన్ని ఎక్కడైనా ఎంతో సులభంగా చేయవచ్చు. """/"/ ఇంకా చెప్పాలంటే ఇంకా సులభంగా చేయగలిగే తడా ఆసనం గురించి తెలుసుకుందాం.

మొదటిగా మీ పాదాలపై నిటారుగా నిలబడి, మీ భుజాలు, మెడను సమానంగా ఉంచి నిటారుగా నిలబడాలి.

తర్వాత నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ రెండు చేతులను సమానంగా పైకి ఎత్తి తర్వాత ఖాళీ వేళ్ళ మీద శరీర బరువును ఉంచుతూ మడమలను నెమ్మదిగా పైకి ఎత్తి శరీరాన్ని వీలైనంత వరకు సాగేలా చేయాలి.

ఈ పొజిషన్లో కాళ్లు చేతులు సమాంతరంగా ఉండేలా చూసుకుంటూ మీకు ఇబ్బంది లేనన్ని సార్లు చేస్తే మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది.

షెల్టర్ హోమ్ నుంచి బాలికను అపహరించిన ఆరుగురు వ్యక్తులు.. వీడియో వైరల్..