హెయిర్ ఫాల్‌కు స్వస్తి పలకాలంటే.. ఈ రెండిటినీ ఫాలో అవ్వండి!
TeluguStop.com
హెయిర్ ఫాల్.ఇటీవల కాలంలో కోట్లాది మందిని తీవ్రంగా మదన పెడుతున్న సమస్య ఇది.
అందులోనూ యువతీ, యువకులు హెయిర్ ఫాల్ కారణంగా మరింత ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు.
ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్‌ను ఆపడం కోసం చేయదగిన ప్రయత్నాలన్నీ చేస్తుంటారు.అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఒక్కోసారి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వదు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే రెండు చిట్కాలను పాటిస్తే.హెయిర్ ఫాల్‌కు సులభంగా స్వస్తి పలకొచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ రెండు చిట్కాలు ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి కాయ పొడి, వన్ టేబుల్ స్పూన్ల శీకాకాయ పొడి, ఐదు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి.
చిన్న మంటపై ఉడికించాలి.రెండు నిమిషాల అనంతరం స్టవ్ ఆఫ్ చేసి.
పల్చటి వస్త్రం సాయంతో ఆయిల్‌ను సపరేట్ చేసుకోవాలి.ఈ ఆయిల్‌ను రాత్రి నిద్రించే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి.
కాసేపు మసాజ్ చేసుకుని పడుకోవాలి.ఉదయాన్నే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఈ విధంగా చేయాలి. """/" /
అలాగే మరో చిట్కా ఏంటంటే.
బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు బీట్‌రూట్ ముక్కలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు కీర ముక్కలు, ఒక కప్పు దానిమ్మ గింజలు, చిన్న అల్లం ముక్క, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్‌ను సపరేట్ చేసి.వన్ టేబుల్ స్పూన్ తేనెను కలిపి సేవించాలి.
ఈ జ్యూస్‌ను ఒక గ్లాస్ చప్పున ప్రతి రోజు తీసుకోవాలి.అంతే ఈ రెండు చిట్కాలను ఫాలో అయితే.