మొబైల్ ఫోన్ వాడటం ఎక్కువ అయిపోయిందా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారు.ఒక్క నిమిషం కూడా మొబైల్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చేసారు.

ఫోన్‌ గుప్పెట్లో మనం ఉన్నామో లేక మన గుప్పెట్లో ఫోన్ ఉందో అనే అయోమయ పరిస్థితిలో మనం ఉన్నాము.

మన శరీరంలో ఒక భాగంగా స్మార్ట్ ఫోన్ మారిపోయింది.ఆయాస్కాంతం ఎలా అయితే ఇనుమును ఆకర్షిస్తుందో అలాగే మనిషిని కూడా అలాగే స్మార్ట్ ఫోన్ ఆకర్షిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.

కానీ ఫోన్ కు ఇంతలా అడిక్ట్ అవ్వడం మంచింది కాదని టెక్ నిపుణులు అంటున్నారు.

నిజానికి ఫోన్లో మనకు అవసరం అయిన వాటికంటే అనవసరం అయినవే ఎక్కువగా వస్తూ ఉంటాయి.

టైమ్ కావాలన్నా ఫోన్, ఎవరికన్నా డబ్బులు పంపాలన్న ఫోన్, మెసేజ్ కి ఫోన్, మాట్లాడానికి ఫోన్, సరుకులకు ఫోన్, ఆడుకోవడానికి ఫోన్, సినిమాలు చూడడానికి ఫోన్ ఇలా ప్రతి సమస్తం కూడా.

ఫోన్ లో నిక్షిప్తం అయిపొయింది.దానికి తగ్గట్టు సామాజిక మాధ్యమాలు కూడా.

ఇలా నిత్యం ఉక్కిరిబిక్కిరి లేకుండా ఫోన్ వాడడం వలన తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు.

అందుకే ఫోన్‌ వాడకాన్ని తగ్గించుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు.ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఫోన్లను పూర్తిగా వాడడం కుదరకపోవచ్చు గానీ కొంతవరకైనా ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవటం సాధ్యమే.

అది ఎలా అని అనుకుంటున్నారా.మీ ఫోన్లో ఉన్న కొన్ని యాప్స్‌ లో సెటింగ్స్‌ ను మార్చుకుంటే చాలు ఫోన్ వాడకం కాస్త తగ్గుతుంది.

ట్విట్టర్‌ అకౌంట్ ఉన్నవారు మీకు నచ్చని వ్యక్తులను, వద్దనుకునే విషయాలకు దూరంగా ఉండాలనుకుంటే మ్యూట్‌ చేయటం చాలా మంచిది.

దీని ఎనేబుల్‌, డిసేబుల్‌ చేసుకుంటే చాలు.ట్వీట్‌లో ఆయా వ్యక్తుల, గ్రూపుల ప్రొఫైల్‌ పక్కన కనిపించే నిలువు మూడు చుక్కలను ట్యాప్‌ చేసి మ్యూట్‌ బటన్‌ను నొక్కితే చాలు.

అంతే వారికి, వాటికి సంబంధించిన ట్వీట్లు కనిపించవు.ఈ కాలంలో ఫేస్‌బుక్‌ వినియోగం కూడా చాలా ఎక్కువ అయిపోయింది.

అభిప్రాయ వేదికగా ఉన్న ఫేస్ బుక్ వలన మీ సమయం కోల్పోతున్నామని భావిస్తే ఫోన్‌లోంచి ఫేస్‌బుక్‌ యాప్‌ ను తొలగించుకోవచ్చు.

"""/" / అలా కాకుండా రాజకీయాల వంటి న్యూస్ వద్దు అనుకుంటే వెబ్‌లోనూ 'న్యూస్‌ ఫీడ్‌ ఎరాడికేటర్‌' ఫర్‌ క్రోమ్‌ వంటి ఎక్స్‌టెన్షన్లను జోడించుకోవచ్చు.

ఇవి న్యూస్‌ ఫీడ్‌ను కనిపించకుండా దాచేసి, వాటికి బదులు స్ఫూర్తిదాయక వ్యాఖ్యలను చూపిస్తాయి.

అలాగే మనం నిత్యం వాట్సాప్‌లో ఏదో ఒక మెసేజ్‌ పంపుతాం.పంపిన తరువాత వాళ్ళు చదివారో లేదోనని బ్లూటిక్‌ కనిపించే అంతవరకు ఆందోళన పడతాం.

మళీ మళ్లీ చూస్తుంటాం.అలాగే మెసేజ్ రిసీవ్ చేసుకున్నావారు మనం చూసినట్టు అవతలివారికి తెలిసినప్పుడు రిప్లయి ఇవ్వపోతే బాగుండదేమోనని ఎంత బిజీగా ఉన్నాగాని రిప్లై ఇస్తుంటాం కదా.

అందుకే రీడ్‌ రిసీప్ట్స్‌ అనే ఫీచర్‌ను డిసేబుల్‌ చేసుకుంటే చాలు.అందుకోసం మీరు సెటింగ్స్‌లోకి వెళ్లి 'అకౌంట్‌'ను ట్యాప్‌ చేయాలి.

తర్వాత 'ప్రైవసీ'ని ఎంచుకొని, 'రీడ్‌ రిసీప్ట్స్‌' ఆప్షన్‌ను ఆఫ్‌ చేయాలి. """/" / ఇక ఇన్‌స్టాగ్రామ్‌ లో మనం.

ఏదన్నా పోస్ట్ పెడితే ఆ పోస్ట్‌కు ఎన్ని లైక్‌లు వచ్చాయన్నది విషయమే కాదు.

అయినా కూడా లైక్‌ చేసినవారెవరో తెలుసుకోవాలనే ఆత్రుత ఉంటుంది.టైమ్ వేస్ట్ అందుకే లైక్‌ అకౌంట్‌ను తొలగించుకుంటే ఈ ఇబ్బందిని తప్పించు కోవచ్చు.

పోస్ట్‌ మీద కుడి వైపున పైన కనిపించే మూడు చుక్కలను నొక్కి 'హైడ్‌ లైక్‌ కౌంట్‌'ను ఎంచుకోవాలి.

ఇకపోతే యూట్యూబ్‌ విషయానికి వస్తే చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరు యూట్యూబ్ వినియోగిస్తున్నారు.

అందుకే యూట్యూబ్‌ అవసరం లేదనుకుంటే ఫోన్‌లోంచి యాప్‌ను తొలగించి, డెస్క్‌టాప్‌ వీక్షణకే పరిమితం కావటం మంచిది.

అలాగే మీ అవసరమైన నోటిఫికేషన్లు మాత్రమే అందేలా సెటింగ్స్‌లో మార్పులు చేసుకోవాలి.దీంతో తరచూ ఫోన్‌ వంక చూడటం తప్పుతుంది.

ఇక మెయిల్స్ విషయానికి వస్తే నోటిఫికేషన్లను ఆఫ్‌ చేసుకొని, ఈమెయిల్‌ను చెక్‌ చేసుకోవటానికి రిమైండర్‌ను సెట్‌ చేసుకోవచ్చు.

ఈమెయిల్లను షెడ్యూల్‌ చేసుకుంటే పనులు తేలికవుతాయి.

ఇప్పటి హీరోయిన్స్ లలో సాయి పల్లవి కి మాత్రమే ఈ ఘనత దక్కింది