పప్పులకు పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!

సాధారణంగా చాలామంది ఏడాదికి సరిపడా పప్పులను తెచ్చుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటారు.కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు( Kandipappu, Pesarappappu, Minappappu, Shanagappappu ) ఇలా ఎన్నో రకాల పప్పులు ఉంటాయి.

వీటన్నిటినీ ఒకేసారి తెచ్చుకుని నిల్వ చేసుకుంటారు.అయితే ఒక్కోసారి పప్పులకు పురుగు పట్టేసి ఉంటుంది.

ముఖ్యంగా ప్రస్తుత వర్షాకాలంలో అధిక తేమ కారణంగా ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతూ ఉంటుంది.

అయితే కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ ను ఫాలో అయ్యారంటే వంటింట్లో ఉండే పప్పులకు పురుగు అనేది పట్టదు.

మరి ఇంతకీ ఆ టిప్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం ప‌దండి.పప్పులు మరియు చిరుధాన్యాలను నిల్వ చేసుకునే డబ్బాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి.

డబ్బాలను శుభ్రంగా కడిగి తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి.ఏమాత్రం తేమ ఉన్న పప్పులకు పురుగు పడతాయి.

అలాగే పప్పులను స్టోర్ చేసుకునే డబ్బాల్లో గుప్పెడు ఎండిన‌ వేపాకు వేసుకోవాలి.వేపాకు పురుగులు వృద్ధి చెందకుండా అడ్డుకట్ట వేస్తుంది.

"""/" / పప్పులకు మరియు బియ్యానికి పురుగు పట్టకుండా రక్షించడంలో వెల్లుల్లి( Garlic ) అద్భుతంగా సహాయపడుతుంది.

పప్పులు మరియు బియ్యం స్టోర్ చేసుకునే డబ్బా లేదా సంచుల్లో పొట్టు తీయని నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి.

ఒకవేళ వెల్లుల్లి ఎండిపోతే వాటిని తొలగించి మళ్ళీ ఫ్రెష్ వెల్లుల్లి వేసుకోవాలి.ఇలా చేస్తే పప్పులకు పురుగు పట్టకుండా ఉంటాయి.

"""/" / ఘాటైన రుచిని క‌లిగి ఉండే లవంగాలు( Cloves ) వంట రుచిని పెంచడమే కాదు.

ప‌ప్పుల‌కు పురుగు ప‌ట్ట‌కుండా కూడా రక్షిస్తాయి.అందుకోసం పప్పులు స్టోర్‌ చేసిన డబ్బాల్లో వ‌న్ టేబుల్ స్సూన్ ల‌వంగాల‌ను ప‌ల్చ‌టి క్లాత్ లో మూట‌గ‌ట్టి ఉంచండి.

మ‌రియు డబ్బాల‌కు గాలి చొరబడకుండా చూసుకోండి.దాంతో ప‌ప్పుల‌కు పురుగు పట్ట‌కుండా ఉంటుంది.

పప్పులకు పురుగు పట్టకుండా సహాయపడడం లో బిర్యానీ ఆకులు కూడా భలే అద్భుతంగా తోడ్పడతాయి.

పప్పుల డబ్బాల్లో రెండు బిర్యానీ ఆకులు వేస్తే మంచి ఫలితం ఉంటుంది.ఇక మీకు విశాలమైన ఫ్రిడ్జ్ ఉంటే కనుక పప్పులను చక్కగా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోండి.

దాంతో ఎన్ని రోజులు ఉన్న పప్పులు పాడవవు మ‌రియు పురుగు పట్టవు.

పుచ్చకాయ ఆరోగ్యాన్నే కాదు జుట్టును పెంచుతుంది.. ఇంతకీ ఎలా వాడాలంటే?