కల్తీ నెయ్యిని గుర్తించేందుకు ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి..!
TeluguStop.com
మన భారతీయ వంటల్లో నెయ్యికి( Ghee ) ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.
వివిధ రకాల వంటకాల్లో నెయ్యిని విరివిగా ఉపయోగిస్తారు.ఆహారం రుచిని పెంచడంలో నెయ్యికి మరొకటి సాటి లేదు.
అలాగే పోషకాలు కూడా మెండుగా ఉండటం వల్ల ఆరోగ్యపరంగా నెయ్యి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అయితే ఈమధ్య కాలంలో నెయ్యి నాణ్యత తగ్గిపోతోంది.కల్తీ భారీగా పెరుగుతోంది.
కల్తీ నెయ్యిని వాడటం వల్ల ప్రయోజనాలు పొందకపోగా.నష్టాలు చేకూరతాయి.
ఈ నేపథ్యంలోనే కల్తీ నెయ్యిని ఎలా గుర్తించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
"""/" /
కల్తీ నెయ్యిని గుర్తించడానికి హీటింగ్ టెస్ట్ చేయవచ్చు.పాన్‌లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చిన్న మంట మీద వేడి చేయండి.
నెయ్యి త్వరగా కరిగి, స్పష్టమైన ద్రవంగా మారితే స్వచ్ఛమైనదిగా గుర్తించాలి.కరగడానికి ఎక్కువ సమయం పట్టినా లేదా అవశేషాలు మిగిలిపోయినా నెయ్యి కల్తీ అయిందని గుర్తించాలి.
"""/" /
పేపర్ టెస్ట్ ద్వారా కూడా నెయ్యి స్వచ్ఛతను తెలుసుకోవచ్చు.ఒక వైట్ పేపర్ పై నెయ్యి చుక్క వేసి కొన్ని నిమిషాలు ఉంచండి.
స్వచ్ఛమైన నెయ్యి క్రమంగా మాయమయ్యే జిడ్డు మరకను వదిలివేస్తుంది.ఒకవేళ మరక కొనసాగిన లేదా అసాధారణంగా జిడ్డుగా ఉన్నా అది కూరగాయల నూనెల ఉనికిని సూచిస్తుంది.
అయోడిన్ టెస్ట్ చేసినా కల్తీ నెయ్యిని గుర్తించవచ్చు.వన్ టేబుల్ స్పూన్ నెయ్యిలో కొన్ని చుక్కల అయోడిన్ సొల్యూషన్( Iodine Solution ) ను జోడించండి.
నెయ్యి నీలం రంగులోకి మారితే, అది కల్తీ అని అర్థం చేసుకోవాలి.అటువంటి నెయ్యిని పొరపాటున కూడా తీసుకోరాదు.
ఇక ఒక గాజు పాత్రలో కొద్ది మొత్తంలో నెయ్యి వేసి కొన్ని గంటల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచండి.
స్వచ్ఛమైన నెయ్యి ఏకరీతిలో సాలిడ్ గా మారుతుంది.ఒకవేళ వేర్వేరు పొరలతో సాలిడ్ గా మారితే సోయాబీన్, కొబ్బరి లేదా పొద్దుతిరుగుడు నూనెలతో నెయ్యిని కల్తీ చేశారని అర్థం చేసుకోవాలి.
ఖాళీ కడుపుతో వీటిని తింటే చాలా డేంజర్..!