ఈ టిప్స్ పాటిస్తే కరోనా వైరస్ రమ్మన్నా రాదు!
TeluguStop.com
కరోనా వైరస్ ప్రపంచ ప్రజలను ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ కు ప్రపంచవ్యాప్తంగా 8 లక్షలమందికిపైగా బలయ్యారు.
అలాంటి ఈ వైరస్ రాకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రస్తుత కాలంలో ఎంత కుదిరితే అంత తక్కువగా బయటకు వెళ్ళాలి.తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్ళాలి.
అలా బయటకు వెళ్లిన సమయంలో తప్పకుండా ఫేస్ మాస్క్ ధరించాలి.కుదిరితే కళ్లద్దాలు లేదా ఫేస్ షీల్డ్ పెట్టుకోండి.
ఇక ఇంట్లోను ఎక్కువ సమయం ఉండకూడదు.వెంటిలేషన్ సరిగ్గా లేకపోతే కాసేపు ఇంటి ఆవరణలో ఉండండి.
శరీరానికి తగిన సూర్యరశ్మి అందేలా చూసుకోవాలి.కాసేపు ఎండలో నిలబడి విటమిన్ డి.
అందేలా చూసుకోవాలి.వీలైనంత వరకు ఏసీలను వాడడం తగ్గిస్తే మంచిది.
కారులో ప్రయాణిస్తుంటే కచ్చితంగా విండోస్ ని తెరవండి.లేదంటే కరోనా వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది.
కొద్ది రోజులపాటు విమాన ప్రయాణాలు చేయకపోవడమే మంచిది.చూశారుగా.
ఈ టిప్స్ పాటిస్తే కరోనా వైరస్ రమ్మన్నా రాదు.కచ్చితంగా ఫేస్ మాస్కు, శానిటైజర్ ఉపయోగించేలా చూసుకోండి.
నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆయనే.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్!