60 లోనూ కురులు నల్లగా మెరవాలంటే ఈ చిట్కాలను తప్పక ఫాలో అవ్వండి!
TeluguStop.com
నల్లటి మెరిసేటి కురులు( Black Glitters ) మనల్ని మరింత అట్రాక్టివ్ గా చూపుతాయి.
అందుకే అటువంటి జుట్టు కోసం ఆరాటపడుతూ ఉంటారు.అయితే ఇటీవల రోజుల్లో ఒత్తిడి, కాలుష్యం, రసాయనాలతో నిండిన కేశ సంబంధిత ఉత్పత్తులు వాడటం తదితర కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు.
అయితే జుట్టు తెల్లబడిన తర్వాత బాధపడటం కంటే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడటం ఎంతో మేలు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలను ఫాలో అయ్యారంటే 60 లోనూ కురులు నల్లగా మెరిసిపోతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.జుట్టులో మెలనిన్( Melanin ) ఉత్పత్తి తగ్గడం వల్ల కురులు తెల్లగా మారుతుంటాయి.
అయితే మెలనిన్ ఉత్పత్తిని పెంచడంలో కరివేపాకు తోడ్పడుతుంది.నాలుగు టేబుల్ స్పూన్ల కరివేపాకు పొడిలో రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనె( Coconut Oil ) మరియు రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.నెలకు కనీసం రెండుసార్లు ఈ మాస్క్ వేసుకుంటే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. """/" /
ఆవ నూనె-ఆముదం ఈ రెండింటి కాంబినేషన్ కురుల విషయంలో మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుంది.
రెండు టేబుల్ స్పూన్ల ఆవ నూనెకు( Mustard Oil ) రెండు టేబుల్ స్పూన్ల ఆముదం కలిపి జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా ఉంటుంది.
హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.చుండ్రు సమస్య దూరమవుతుంది.
"""/" /
ఇక 60 లోనూ తమ జుట్టు నల్లగా మెరిసిపోవాలని భావించే వారు ఒకటిన్నర గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ టీ పౌడర్( Spoon Tea Powder ), రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి ( Amla Powder )వేసి పది నిమిషాల పాటు మరిగించండి.
ఆపై స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత స్ప్రే బాటిల్ లో నింపుకోండి.
ఈ టోనర్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి స్ప్రే చేసుకుని గంట అనంతరం తల స్నానం చేయాలి.
వారానికి ఒకసారి ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే వైట్ హెయిర్ సమస్య దరిచేరకుండా ఉంటుంది.
జుట్టు ఎల్లప్పుడూ నల్లగా ఆరోగ్యంగా మెరుస్తుంది.
ధనుష్ నయనతార వివాదంలో త్రివిక్రమ్.. పూనమ్ కౌర్ పోస్ట్ చూస్తే షాకవ్వాల్సిందే!