పిల్లలు మాట వినాలంటే ఈ పనులు చెయ్యండి!
TeluguStop.com
ప్రస్తుత కాలంలో పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు.పిల్లలు అన్నాక అల్లరి పనులు చేస్తూ ఉంటారు.
అలా వారు అల్లరి చేయడం ఎంతో సరదాగా ఆనందంగా ఉంటుంది.కానీ అల్లరి చేష్టలు వారు పెరుగుతున్నకొద్దీ వారిలో ఏ మాత్రం మార్పు లేకుండా అలాగే చేస్తూ ఉంటారు.
మరికొందరు పిల్లలైతే ఎక్కువగా మారాం చేస్తూ గంటల కొద్దీ ఏడుస్తూ ఉంటారు.పిల్లలు చేసే అల్లరి ని తట్టుకోలేక బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు.
అయితే పిల్లలు మారం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.పిల్లల గదిలో ఎప్పుడూ కూడా అద్దం ఉంచరాదు.
అద్దం ఉంచడం వల్ల పిల్లల పై ప్రతికూల వాతావరణం ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
అందుకోసమే వారి గదిలో అద్దం ఉంచకూడదు.ఒకవేళ ఉన్నా దానిని ఏదైనా వస్త్రంతో కప్పి ఉంచాలి.
పిల్లలు నిద్రించే సమయంలో వారి తల ఎల్లప్పుడు కూడా దక్షిణ దిశ వైపు ఉండేలా పడుకోబెట్టాలి.
అలా చేయడం వల్ల వారికి ఎలాంటి పీడకలలు రాకుండా హాయిగా నిద్ర పోతారు.
పిల్లలు ఎక్కువ మారం చేస్తుంటే వారికి పలహారం వండేటప్పుడు శాంతి మంత్రం పఠించడం ద్వారా పిల్లలో మారం చేయడం తగ్గుతుంది.
పిల్లలకు వీలైనంత వరకు నల్లటి రంగు దుస్తులను ధరించడం మానుకోవాలి.నల్లటి దుస్తులను ధరించడం ద్వారా అధిక ఒత్తిడికి లోనవుతుంటారు.
అంతేకాకుండా వారు నిద్రించే సమయం గదిలో చీకటి లేకుండా కొద్దిగా వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
చీకటి గదిలో పిల్లలు నిద్రించడం వల్ల గ్రహపీడ శక్తులు వారిపై ఉంటాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
అందువల్ల వారిని చీకటి గదిలో పడుకో పెట్టకూడదు.అంతేకాకుండా పౌర్ణమి రోజున వెన్నెల పడే చోట పిల్లలకు ఏదైనా తీపి పదార్థం తినిపించడం ద్వారా వారు సరైన క్రమం పెద్దల మాట వింటారని పండితులు చెబుతున్నారు.
పిల్లలతో మాట్లాడేటప్పుడు వారిని ప్రేమగా వారిని దగ్గరికి తీసుకోవడం ద్వారా వారు సరైన మార్గంలో నడుస్తారు.
వైరల్: కోడిని వెంటాడిన మొసళ్లు.. ఎవరు గెలిచారంటే?