పులిపిరులు పోవాలంటే ఇలా చేస్తే సరి..!

మీకు పులిపిరి కాయలు ఉన్నాయా.? అసలు అవి ఎలా ఏర్పడతాయి.

? ఎందుకు వస్తాయి.? అనే విషయం గురించి ఎప్పుడన్నా ఆలోచించారా.

? అవి ఎందుకు వస్తాయో తెలియదు గాని వాటి వల్ల మా అందం మాత్రం డ్యామేజ్ అవుతుందని అనుకుంటున్నారు కదా.

అవి పోవడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఉంటారు.కానీ ఆశించిన ఫలితం దక్కలేదని చింతిస్తున్నారా.

? అయితే ఈ విషయాలు తెలుసుకోవలసిందే.మీ సందేహాలు అన్ని క్లియర్ అవడంతో పాటు పులిపిరి కాయల గురించి కూడా మీకు ఒక అవగాహన అనేది వస్తుంది.

ఈ పులిపిరి కాయలు చూడడానికి చర్మం మీద నల్లగా, చిన్న పొక్కులలాగా ఉంటాయి.

అయితే ఇవి ఉండడం వలన శరీరానికి కలిగే నష్టం అయితే ఏమి లేదు కానీ.

వీటిని చూడడానికి మాత్రం కాస్త ఎబ్బెట్టుగా అనిపిస్తాయన్నమాట.ఎక్కువగా మెడ ప్రాంతంలో ఈ పులిపిరి కాయలు ఎక్కువగా ఏర్పడతాయి.

అసలు ఇవి ఎందుకు వస్తాయి అంటే మన శరీరంలో ఉండే యాంటీబాడీస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి కారణం అయ్యే వైరస్ లతో ఫైట్ చేయడం వలన కొన్ని డెడ్ వైరస్ కణాలు చర్మం పైన పొంగులా వస్తాయి.

అవి నల్లగా మాడి పులిపిరి కాయల్లా ఏర్పడతాయన్నమాట.ఈ రకమైన చర్య అందరి శరీరంలో జరుగుతుంది.

కానీ ఈ పులిపిర్లు మాత్రం అందరికి రావు.కొంతమందికి మాత్రమే వస్తాయి.

ఈ పులిపిరి కాయలను తగ్గించడానికి ఈ కింది టిప్స్ ను పాటించి చూడండి.

కొద్ది రోజుల్లోనే మీరు ఆశించిన ఫలితం దక్కుతుంది. """/" / ముందుగా ఒక తమలపాకును తీసుకుని దాని తొడిమని పట్టుకుని పైకి, కిందకి రుద్దుతూ ఉంటే ఆ తొడిమ నుండి రసం అనేది వస్తుంది.

ఆ రసాన్ని ఎక్కడయితే పులిపిరులు ఉన్నాయో అక్కడ రాస్తే ఒక మూడు నెలల వ్యవధిలో ఇవి రాలిపోయే అవకాశం ఉంటుంది.

అయితే ఇలా ఒక్కసారి మాత్రమే చేస్తే ఫలితం ఉండదు.వారానికి రెండు సార్లు ఇలా తమలపాకుతో చేస్తే ఫలితం ఉంటుంది.

"""/" / అలాగే ఒక ప్రముఖ ఆయుర్వేద పుస్తకం ప్రకారం కామంచి ఆకుల రసానికి, సైంధవ లవణం అంటే ఉప్పును కలిపి పులిపిరులకు పట్టిస్తే కొద్ది రోజుల్లో వాటంతట అవే ఊడిపోతాయట.

అలాగే పులిపిరులు తగ్గుదల కోసం హోమియోలో ఆసిడ్ నైట్రికం అనే హోమియో మెడిసిన్ వాడితే మీకు మంచి ఫలితాలు వస్తాయి.

అలాగే అరటి పండు తొక్కతో రోజు పులిపిర్లపై రుద్దితే అవి క్రమేణా తగ్గుముఖం పడతాయి.

పవన్ ఫ్యాన్స్ లేకపోతే చిరు సినిమాలు ఆడవు.. గ్రంథి శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్!