Smart Phone : కొన్ని సింపుల్ స్టెప్స్ తో పాత స్మార్ట్ ఫోన్ ను సెక్యూరిటీ కెమెరాలా మార్చుకోండిలా..!
TeluguStop.com
భారత మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్( Smart Phone ) సరికొత్త ఫీచర్లతో సందడి చేస్తోంది.
ఫీచర్ల అవసరాలను బట్టి కొన్ని రోజులకే ఫోన్ ను మార్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇక ఫోన్ మారిస్తే కొంతమంది పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేస్తారు.మరి కొంతమంది ఫోన్ ను వినియోగించకుండా ఇంట్లో ఒక మూలన పడేస్తారు.
అయితే పాత స్మార్ట్ ఫోన్ ను సెక్యూరిటీ కెమెరా లాగా( Security Camera ) మార్చుకుంటే.
సీసీటీవీ కెమెరా సెటప్ కు అయ్యే ఖర్చు మిగులుతుంది.ప్రస్తుత కాలంలో సీసీటీవీ కెమెరాల వినియోగం ఎంతలా పెరిగిందో అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు కేవలం దుకాణాలకు మాత్రమే పరిమితమైన సీసీటీవీ కెమెరాలు( CCTV Cameras ) ప్రస్తుతం ఇంటి భద్రత కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు.
మరి సీసీటీవీ కెమెరా సెటప్ చేయాలంటే.కాస్త అధిక ఖర్చు పెట్టాల్సిందే.
కాబట్టి పాత స్మార్ట్ ఫోన్ ను సెక్యూరిటీ కెమెరా లాగా మార్చుకుంటే సరిపోతుంది.
"""/" /
మీ పాత స్మార్ట్ ఫోన్ తో పాటు ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ లో సెక్యూరిటీ కెమెరా యాప్ ను( Security Camera App ) డౌన్లోడ్ చేసుకోవాలి.
ఆ తర్వాత అవసరం అయిన పర్మిషన్స్ తో పాటు గూగుల్ అకౌంట్ లోకి సైన్ ఇన్ కావాలి.
రెండు ఫోన్లలో సైన్ ఇన్ అయిన తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి నోటిఫికేషన్ ఆన్/ ఆఫ్, లో లైట్ ఫిల్టర్ లాంటి ఫీచర్స్ ను ఎనేబుల్ చేసుకోవాలి.
"""/" /
ఇక మీరు సెక్యూరిటీగా ఉపయోగించుకోవాలి అనుకునే ఫోన్ ను కావలసిన చోట సెట్ చేసుకోవాలి.
ఒకవేళ మీ వద్ద ఒకటి కంటే ఎక్కువ పాత ఫోన్స్ ఉంటే పలు డైరెక్షన్స్ లలో ఫోన్లను ఏర్పాటు చేసుకోవాలి.
ఇక పాత ఫోన్లో సెక్యూరిటీ కెమెరా యాప్ ను ఓపెన్ చేసి ఉంచాలి.
ఇక పాత, కొత్త ఫోన్లో లైవ్ స్ట్రీమింగ్ ను చూసుకోవచ్చు.ఇలా పాత ఫోను సెక్యూరిటీ కెమెరా లాగా ఉపయోగించుకోవచ్చు.
గుట్ట పైఅంచు నుంచి సముద్రంలోకి దూకాడు.. అతడి బాడీకి ఏమైందో చూస్తే వణికిపోతారు!