టీనేజ్ లోనే తెల్ల జుట్టు రావడం ప్రారంభమైందా.. వర్రీ వద్దు వెంటనే ఇలా చేయండి!

ఆహారపు అలవాట్లు, అనారోగ్యమైన జీవనశైలి కారణంగా ఇటీవల కాలంలో చాలా మంది టీనేజ్ లోనే తెల్ల జుట్టు సమస్యను ( White Hair Problem )ఎదుర్కొంటున్నారు.

తక్కువ వయసులోనే తెల్ల జుట్టు రావడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.కానీ వ‌ర్రీ వద్దు ఒత్తిడిని పెంచుకుంటే సమస్య మరింత అధికమవుతుంది.

అలా కాకుండా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ను పాటిస్తే తెల్ల జుట్టుకు చెక్ పెట్టవచ్చు.

టీనేజ్‌ లోనే తెల్ల జుట్టు రావడం ప్రారంభమైతే ఆలస్యం చేయకుండా వెంటనే జీవన శైలిలో కొన్ని కొన్ని మార్పులు చేసుకోవాలి.

ముఖ్యంగా స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే మానుకోవాలి.ఎండల్లో తిరిగేటప్పుడు జుట్టును ఎప్పుడూ కవర్ చేసుకోవాలి.

అలాగే జింక్‌, ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ బి, విటమిన్ బి12 వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.

కఠినమైన సోప్స్, షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవడం మానుకోవాలి.హెయిర్ స్టైలింగ్ టూల్స్ వాడటం ఆపాలి.

"""/" / అలాగే రోజు నైట్ నిద్రించేముందు కోకోనట్ ఆయిల‌ను ( Coconut Oil )తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి.

ప్రతిరోజు రెండు టేబుల్ స్పూన్లు నల్ల నువ్వులు( Black Sesame ) తినడం అలవాటు చేసుకోవాలి.

మాంసాహారం తగ్గించి కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.వీటితో పాటు మరొక సూపర్ పవర్ ఫుల్ రెమెడీ ని ఫాలో అవ్వాలి.

దానికోసం మిక్సీ జార్ లో అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు గింజలు తొలగించి కట్ చేసిన ఉసిరికాయలు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో మూడు టేబుల్ స్పూన్లు హెన్నా పౌడర్,( Henna Powder ) రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

గంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు ప‌ట్టించాలి.

40 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటించాలి.

ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వడం ద్వారా టీనేజ్‌ లోనే ప్రారంభమైన తెల్ల జుట్టుకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

ఈ టిప్స్ తో జుట్టు తెల్లగా మారడం ఆగుతోంది.అలాగే తెల్లగా మారిన జుట్టు కూడా క్రమంగా నల్లబడుతుంది.

జుట్టు ఆరోగ్యంగా ఒత్తుగా సైతం పెరుగుతుంది.

టాలీవుడ్ లో ఇతర భాషల హీరోల హవా.. తమ సినిమాలతో అదరగొడుతున్నారుగా!