ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే ఇంట్లో దోమలన్నీ పరార్ అవ్వాల్సిందే!
TeluguStop.com
ప్రస్తుత వర్షాకాలంలో( Monsoon ) దోమల బెడద ఎంత అధికంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సాయంత్రం ఐదు గంటల నుంచి దోమల( Mosquitoes ) విహారయాత్ర ప్రారంభమవుతుంది.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా ఇంట్లోకి దోమలు వచ్చేస్తుంటాయి.
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందర్నీ కుట్టి కుట్టి చంపేస్తుంటాయి.ఈ సీజన్ లో వచ్చే అనేక వ్యాధులకు దోమలే ప్రధాన కారణం.
కాబట్టి వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం.ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే ఇంట్లో ఉన్న దోమలన్నిటినీ చాలా సులభంగా తరిమి కొట్టవచ్చు.
"""/" /
టిప్-1: ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కర్పూరం పొడి( Camphor Powder ) మరియు మూడు టేబుల్ స్పూన్లు వేప నూనె( Neem Oil ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఆయిల్ ను రెండు బిర్యానీ ఆకులకు పట్టించాలి.ఆపై ఇంట్లో ఆ బిర్యానీ ఆకులను కాల్చాలి.
అలా కాల్చినప్పుడు బాగా పొగ వస్తుంది.ఆ పొగ దోమలకు అస్సలు పడదు.
దాంతో ఇంట్లో ఎక్కడ ఉన్నా సరే దోమలన్నీ ఆ పొగకు పరార్ అవుతాయి.
"""/" /
టిప్-2: వెల్లుల్లి తినడానికి చాలా రుచిగా ఉంటుంది.ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
కానీ వెల్లుల్లి( Garlic ) వాసన దోమలకు అస్సలు పడదు.కాబట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె పోసుకోవాలి.
అలాగే పది నుంచి పదిహేను పచ్చి వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి ఆయిల్ లో వేసుకుని చిన్న మంటపై ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ ను ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు సాయంత్రం వేళ తయారు చేసుకున్న వెల్లుల్లి ఆయిల్ ను చేతులకు, కాళ్లకు అప్లై చేసుకోవాలి.
ఇలా చేస్తే దోమలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.వెల్లుల్లి ఆయిల్ దోమల నుంచి మీకు రక్షణ కల్పిస్తుంది.
మరో సినిమాకి సీక్వెల్ రెడీ చేస్తున్న సందీప్ రెడ్డి వంగ…