పీరియ‌డ్స్ కాస్త ముందుగా రావాలనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

ప్ర‌తినెలా ప‌ల‌క‌రించే పీరియ‌డ్స్( Periods ) వ‌ల్ల ఆడ‌వారు ఎన్ని ఇబ్బందులు ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

కొంద‌రికి టైమ్ టూ టైమ్ పీరియ‌డ్స్ వ‌స్తుంటాయి.కొంద‌రికి మాత్రం ఒత్తిడి, హార్మోన్లు అసమతుల్యత, థైరాయిడ్ త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల పీరియ‌డ్స్ ఆల‌స్య‌మ‌వుతూ ఉంటాయి.

అయితే ఇంట్లో ఏమైనా ఫంక్ష‌న్స్‌ లేదా ఫెస్టివ‌ల్స్ ఉన్న‌ప్పుడు ఆడ‌వారు పీరియ‌డ్స్ కాస్త ముందుగా రావాల‌ని కోరుకుంటూ ఉంటాయి.

పీరియ‌డ్స్ ను ప్రీ పోన్( Prepone Periods ) చేయ‌డానికి మందులు ఉన్న‌ప్ప‌టికీ వాటిని వేసుకోవ‌డం చాలా ప్ర‌మాద‌క‌రం.

కానీ ఇప్పుడు చెప్ప‌బోయే ఇంటి చిట్కాల‌ను పాటిస్తే స‌హ‌జంగానే పీరియ‌డ్స్ ను ప్రీపోన్ చేయ‌వ‌చ్చు.

పైగా ఈ టిప్స్ వ‌ల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండ‌వు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం పీరియ‌డ్స్ ముందుగా రావాలంటే ఎలాంటి టిప్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసుకుందాం ప‌దండి.

పసుపు మీ పీరియడ్స్ మునుపటి కంటే త్వరగా రావడానికి సహాయపడుతుంది.అందుకోసం మీరు పీరియ‌డ్స్ తేదీ కంటే ప‌ది రోజుల ముందు నుంచి నిత్యం నైట్ ప‌సుపు పాలు( Turmeric Milk ) తీసుకోండి.

ఇలా చేస్తే త్వ‌ర‌గా పీరియ‌డ్స్ వ‌స్తాయి. """/" / విటమిన్ సి( Vitamin C ) అధికంగా ఉండే ఆహారాలు పీరియడ్స్ త్వరగా రావ‌డానికి స‌హాయ‌ప‌డ‌తాయి.

విట‌మిన్ సి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచి పీరియ‌డ్స్ ను ప్రీ పోన్ చేస్తుంది.

కాబ‌ట్టి నెల‌స‌రి ముందుగా రావాలంటే సిట్రస్ పండ్లు, కివీ, టమోటాలు, బ్రోకలీ మరియు బెల్ పెప్పర్స్ వంటి విట‌మిన్ సి రిచ్ ఫుడ్స్ ను డైట్‌లో చేర్చుకోండి.

అలాగే నెల‌స‌రి తేదీకి ప‌ది రోజుల ముందు నుంచి దానిమ్మ‌ను తీసుకోండి.పీరియడ్స్‌ను ప్రోత్సహించడానికి దానిమ్మ( Pomegranate ) ఉత్త‌మంగా స‌హాయ‌ప‌డుతుంది.

"""/" / రుతుక్రమాన్ని ప్రేరేపించడంలో నువ్వులు, ఖ‌ర్జూరం, బొప్పాయి వంటి ఆహారాలు కూడా తోడ్ప‌తాయి.

ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఏర్పడుతుంది.ఇది గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది.

దాంతో మీ పీరియడ్స్ కాస్త ముందుగానే వ‌స్తాయి.ఇక నెల‌స‌రి తేదీకి ప‌ది రోజుల ముందు నుంచి అల్లం టీ లేదా ధ‌నియాల టీ తీసుకున్నా కూడా పీరియ‌డ్స్ త్వ‌ర‌గా వ‌స్తాయి.

ఈ జనరేషన్ లో పోలీస్ రోల్స్ లో ఎక్కువగా నటించి విజయాలు సాధించిన స్టార్ హీరో వీళ్లే!