పాదాలు తెల్లగా మృదువుగా మెరిసిపోవాలా.. అయితే ఇలా చేయడం అస్సలు మర్చిపోకండి!

ప్రస్తుత వర్షాకాలంలో పాదాలను కాపాడుకోవడం కాస్త కష్టమే.వర్షపు నీరు, బురద పాదాలను చాలా డ్యామేజ్ చేస్తుంటాయి.

పాదాల మెరుపును దూరం చేస్తాయి.మగవారు పాదాల గురించి పెద్దగా పట్టించుకోరు.

కానీ ఆడవారు మాత్రం తమ పాదాల‌ను తెల్లగా మృదువుగా మెరిపించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు.

అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. """/" / అందమైన తెల్లటి మెరిసే పాదాల కోసం ముందుగా ఒక బకెట్ లో సగానికి గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.

అందులో రెండు టీ స్పూన్లు బేకింగ్ సోడా, నాలుగు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు( Salt ) మ‌రియు రెండు టేబుల్ స్పూన్లు షాంపూ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ వాటర్ లో పాదాలను పది నిమిషాల పాటు నానబెట్టాలి.ఆపై బ్రష్ తో పాదాలు బాగా రుద్ది క్లాత్ తో శుభ్రం చేసుకోవాలి.

</br """/" / ఇది అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ సరిపడా లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా త‌యారు చేసుకున్న‌ మిశ్రమాన్ని పాదాలు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

పూర్తిగా డ్రై అయిన అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

వారానికి ఒక్కసారి ఈ రెండు చిట్కాలు పాటించారంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.

ఈ సింపుల్ చిట్కాలు పాదాలపై పేరుకుపోయిన మురికి మృత కణాలను తొలగిస్తుంది.పాదాలను తెల్లగా మారుస్తుంది.

డ్రై నెస్ ను తగ్గిస్తుంది.మృదువైన తెల్లటి మెరిసే పాదాలను మీ సొంతం చేస్తుంది.

పైగా ఈ రెండు చిట్కాలను పాటించడం వల్ల పాదాల పగుళ్ళకు సైతం దూరంగా ఉండవచ్చు.

కొరటాల-ప్రభాస్ కాంబోలో మరో మూవీ.. ఈ టైమ్‌లో ఫ్యాన్స్‌కి ఓకేనా..?