ఐబ్రోస్ దట్టంగా పెరగాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

సన్నగా ఒత్తుగా కనిపించే ఐబ్రోస్( Eyebrows ) ప్రస్తుతం ట్రెండ్ అయిపోయింది.అందుకే అటువంటి ఐబ్రోస్ కోసం మగువలు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు.

అయితే కొందరిలో ఐబ్రోస్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు.దాని వల్ల ఐబ్రోస్ చాలా పల్చగా కనిపిస్తూ ఉంటాయి.

అటువంటి ఐబ్రోస్ ను దట్టంగా పెంచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ మీకు చాలా బాగా సహాయ పడతాయి.

ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే సహజంగానే ఒత్తుగా పెరుగుతాయి.h3 Class=subheader-styleటిప్ 1:/h3p గుడ్డులోని పచ్చసొన ఐబ్రోస్ గ్రోత్ ను ప్రోత్సహించడంలో అద్భుతంగా తోడ్పడుతుంది.

గుడ్డులోని పచ్చసొన లో పావు టీ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఐబ్రోస్ కి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.రెండు రోజులకు ఒకసారి ఈ విధంగా చేస్తే మీ ఐబ్రోస్ దట్టంగా మారతాయి.

"""/" / H3 Class=subheader-styleటిప్ 2:/h3p ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ రసం, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం ( Lemon Juice )వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

దీన్ని దూది సాయంతో కనుబొమ్మలపై అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఈ సింపుల్ టిప్ ఐబ్రోస్ గ్రోత్ పెంచుతుంది.పల్చటి ఐబ్రోస్ ను దట్టంగా మారుస్తుంది.

H3 Class=subheader-styleటిప్ 3:/h3p """/" / కురుల పెరుగుదలను ప్రోత్సహించడంలో ఆముదం ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది.

ఇది ఐబ్రోస్ కి కూడా వర్తిస్తుంది.రోజు నైట్ నిద్రించే ముందు రెండు మూడు చుక్కలు ఆముదాన్ని ఐబ్రోస్ పై అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

గా ఈ విధంగా చేసే కొద్ది రోజుల్లోనే మీ కనుబొమ్మలు ఒత్తుగా మారతాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి28, మంగళవారం2024