Dark Elbows : మోచేతులు నల్లగా అసహ్యంగా కనిపిస్తున్నాయా.. వారం రోజుల్లో వైట్ గా మార్చుకోండిలా!

శరీరం మొత్తం ఒకే రంగులో ఉన్న కూడా చాలా మందికి మోచేతులు మాత్రం నల్లగా, గరుకుగా ఉంటాయి.

చేతులు తెల్లగా మృదువుగా మెరుస్తుంటే.న‌లుపు కార‌ణంగా మోచేతులు ఎంతో అసహ్యంగా మరియు వేరుపాటుగా కనిపిస్తుంటాయి.

దీంతో చేతుల నలుపును వదిలించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.

? అయితే అస్సలు టెన్షన్ పడకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలతో కేవలం వారం రోజుల్లో మీరు మీ మోచేతులను వైట్ మరియు బ్యూటిఫుల్ గా మార్చుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి. """/" / టమాటో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో విరివిరిగా వాడే కూరగాయల్లో ఒకటి.

అయితే టమాటోలో అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ కూడా దాగున్నాయి.

ముఖ్యంగా మోచేతుల నలుపును పోగొట్టడానికి టమాటో( Tomato ) అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.

ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి మరియు నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ టమాటో ప్యూరీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని మోచేతులకు అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై మోచేతులను కనీసం ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకుని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

రోజుకి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని ఫాలో అయ్యారంటే మోచేతులు వద్ద ఉన్న నలుపు క్రమంగా మాయమవుతుంది.

వారం రోజుల్లోనే మీ మోచేతులు తెల్లగా మృదువుగా మారడం స్టార్ట్ అవుతాయి. """/" / అలాగే మోచేతుల నలుపును వదిలించడానికి మరొక అద్భుతమైన రెమెడీ కూడా ఉంది.

దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు మరియు వన్ టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్ వేసి ( White Vinegar )బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మోచేతుల‌కు అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై మరో 10 నిమిషాల పాటు బాగా మోచేతులను మసాజ్ చేసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.ఇక మోచేతులు నల్లగా ఉన్నాయని బాధపడుతున్న వారు ప్రతి రోజూ అర నిమ్మ చెక్కను తీసుకుని మోచేతులకు కనీసం పది నిమిషాల పాటు రుద్దాలి.

క‌నీసం ఐదు నిమిషాల పాటు ఇలా చేసి వాటర్ తో క్లీన్ చేసుకోండి.

ఇలా చేయడం వల్ల మోచేతుల నలుపు పూర్తిగా మాయం అవుతుంది.మోచేతులు తెల్లగా అందంగా మారతాయి.

రాష్ట్రపతి భవన్ చరిత్రలో అరుదైన వివాహం