అజీర్తితో వర్రీ వద్దు.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి!
TeluguStop.com
సాధారణంగా కొందరికి అరుగుదల అనేది చాలా తక్కువగా ఉంటుంది.అందువల్ల తరచూ అజీర్తి సమస్య( Indigestion )తో ఇబ్బంది పడుతుంటారు.
ఏదైనా తింటే చాలు బాధ మొదలవుతుంది.తిన్న ఆహారం అరగకపోవడం వల్ల కడుపులో అసౌకర్యం, గుండెల్లో మంట, వికారం, వాంతులు తదితర సమస్యలన్నీ తలెత్తుతాయి.
ఈ క్రమంలోనే కొందరు అరుగుదలను పెంచుకునేందుకు మందులు వాడుతుంటారు.కానీ మందులతో పని లేకుండా కూడా అజీర్తి కి ఆమడ దూరంలో ఉండవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
"""/" /
అరుగుదలను పెంచడానికి మెంతులు అద్భుతంగా తోడ్పడతాయి.జీర్ణ ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి.
మంచిగా ఫ్రై చేసిన ఒక కప్పు మెంతులను మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసి ఒక బాక్స్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు ఉదయం అర టీ స్పూన్ మెంతుల పొడికి వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి ( Jaggery Powder )వన్ టేబుల్ స్పూన్ నెయ్యి( Ghee ) కలిపి ఉండగా చుట్టి నేరుగా తినాలి.
బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ విధంగా కనుక చేశారంటే అజీర్తి అన్న మాటే అనరు.
మెంతులు, నెయ్యి, బెల్లం.ఇవి మూడు జీర్ణ వ్యవస్థను చురుగ్గా మారుస్తాయి.
డైజీషన్ ను ఇంప్రూవ్ చేస్తాయి.అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు మీ దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.
"""/" /
ఇకపోతే భోజనం తర్వాత చివర్లో ఒక గ్లాసు మజ్జిగ తాగే అలవాటు దాదాపు అందరికీ ఉంటుంది.
అయితే మజ్జిగను నేరుగా కాకుండా చిటికెడు ఇంగువ మరియు చిటికెడు నల్ల ఉప్పు కలిపి తీసుకోండి.
ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.అజీర్తి సమస్య తలెత్తకుండా ఉంటుంది.
విద్యార్థులకు వింత రూల్ పెట్టిన కాలిఫోర్నియా టీచర్..