జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

ఈ మధ్యకాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యతో( Hair Fall ) బాధపడుతూ ఉన్నారు.

మరి ముఖ్యంగా ఈ సమస్య ఎక్కువగా యువతలో కనిపిస్తోంది.అయితే జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

ఒత్తిడి, నిద్ర లేకపోవడం, సరైన జీవనశైలిని ఆలవరచుకోలేకపోవడం లాంటి ప్రధాన కారణాలు చెప్పవచ్చు.

అయితే విటమిన్ సి, జింక్, ఐరన్ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా వరకు జుట్టు రాలిపోవడం తగ్గించవచ్చు.

అలాగే ఉసిరి, నారింజ, బత్తాయి, నిమ్మ, జామ లాంటి పండ్లలో విటమిన్ సి( Vitamin C ) పుష్కలంగా లభిస్తుంది.

అంతేకాకుండా గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, సిఫుడ్, మాంసం, వేరుశనగలు, డార్క్ చాక్లెట్లలో జింక్ అధికంగా ఉంటుంది.

"""/" / ఆకు కూరలు, డ్రై ఫ్రూట్స్, గుడ్లలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

కాబట్టి ఈ ఫుడ్ తినడం వలన మీ శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.

దీంతో మీ జుట్టు రాలిపోకుండా ఉంటుంది.అంతేకాకుండా ఒత్తైన జుట్టు రావడంతో పాటు కుదుళ్ళు కూడా బలపడతాయి.

అంతేకాకుండా ఈ ఆహారం తీసుకుంటూ వారంలో రెండు సార్లు తల స్నానం( Head Bath ) చేస్తూ ఉండాలి.

ఇలా చేయడం వలన హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది.అయినప్పటికీ ఇంకా జుట్టు రాలుతూ ఉంటే థైరాయిడ్ టెస్ట్( Thyroid Test ) చేసుకోవడం మంచిది.

వైద్యుల సలహాతో మందులు వాడాలి. """/" / ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా కూడా ఈ సమస్య మొదలవుతుంది.

మీ డైట్ లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చూసుకోవాలి.దీంతో మీ జుట్టు రాలడానికి తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో మెంతులు కీలక పాత్ర పోషిస్తాయి.

కాబట్టి మెంతి గింజలను గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసి తలకు పట్టించుకోవాలి.

ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వలన ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

ఇక నిమ్మరసం, కొబ్బరి నూనె మిశ్రమాన్ని తలకు అప్లై చేయడం వలన కూడా హెయిర్ ఫాల్ సమస్య ఉండదు.

ఒకేసారి 14,000 మంది జాతీయ గీతం పాడితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా..