రోజూ జిమ్‌కి వెళ్తున్నారా? అయితే ఈ జాగ్ర‌త్త‌లు మీకే!

ఇటీవ‌ల కాలంలో జిమ్‌కి వెళ్లేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.కండ‌ల‌ను పెంచుకునేందుకు, కొవ్వును క‌రిగించుకునేందుకు, థైరాయిడ్‌.

ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు చాలా మంది జిమ్‌నే ఆశ్రయిస్తున్నారు.

అయితే కార‌ణం ఏదైనా జిమ్‌కి వెళ్లే వారు ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మ‌రి ఆ జాగ్ర‌త్త‌లు ఏంటీ అన్న‌ది ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా కొన్ని జిమ్ సెంట‌ర్లు చాలా ఇరుగ్గా ఉంటాయి.క‌నీసం వెంటిలేషన్ కూడా ఉండ‌దు.

అయితే అలాంటి జిమ్‌కి వెళ్ల‌క పోవ‌డ‌మే మంచిది.అవును, వెంటిలేష‌న్ లేని గదుల్లో వ‌ర్కౌట్లు చేసిన‌ప్పుడు.

మ‌నం వదిలే గాలినే తిరిగి పీల్చుకోవాల్సి ఉంటుంది.దీని వ‌ల్ల ర‌క్తంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ శాతం పెరిగి పోతుంది.

ఫ‌లితంగా తీవ్ర‌మైన త‌ల నొప్పి, ఆల‌స‌ట‌, ర‌క్త పోటు స్థాయిలు ప‌డి పోవ‌డం వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

"""/" / అలాగే జిమ్‌కి వెళ్లే వారు బ్యాగ్‌లో ఖ‌చ్చితంగా వాట‌ర్ బాటిల్‌, స్వెట్‌ను క్లీన్ చేసుకునేందుకు ట‌వ‌ల్‌, శానిటైజర్‌, మాస్క్‌, ఓఆర్‌ఎస్, న‌ట్స్‌, తాజా పండ్లు వంటివి త‌ప్ప‌ని స‌రిగా తీసుకువెళ్లండి.

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌డంతో.ఎక్క‌డికి వెళ్లినా మాస్క్ తప్ప‌నిస‌రి అయిపోయింది.

కానీ, జిమ్‌లో వ్యాయామాలు చేసేట‌ప్పుడు మాత్రం మాస్క్ ధ‌రంచ‌కూడ‌దు.ఇక జిమ్‌లో ఎప్పుడూ ఒకే విధమైన వ్యాయమం కాకుండా ర‌క‌ర‌కాలు చేస్తుండాలి.

కోచ్‌ సలహాలు, సూచనలు ఎప్ప‌టిక‌ప్పుడు తీసుకోవాలి.సామర్థ్యానికి మించి వ్యాయామాల‌ను అస్స‌లు చేయ‌రాదు.

సౌకర్యంగా ఉండే షూస్‌నే ధ‌రించాలి.పౌష్టికాహారం తీసుకోవాలి.

జ్వ‌రం, జ‌లుబు, ద‌గ్గు వంటి సీజ‌నల్ వ్యాధులతో బాధ ప‌డుతుంటే జిమ్‌కి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.

మ‌రియు ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లేవైనా ఉంటే.వైద్య నిపుణుల‌ను సంప్ర‌దించిన త‌ర్వాతే జిమ్‌కి వెళ్లాలి.

ఈనెల 23న పవన్ కళ్యాణ్ నామినేషన్..!!