న్యూ ఇయర్ రాబోతుంది.. హ్యాంగోవర్ కు దూరంగా ఉండాలనుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
TeluguStop.com
ప్రపంచమంతా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే న్యూ ఇయర్( New Year ) రాబోతుంది.
మరో రెండు రోజుల్లో 2024కు గుడ్ బై చెప్పేసి 2025లోకి అడుగు పెట్టబోతున్నాము.
న్యూ ఇయర్ అంటే డిసెంబర్ 31న ఎంత హడావుడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ యువత పార్టీల్లో మునిగి తేలుతుంటారు.
మద్యం మత్తులో ఊగుతుంటారు.అయితే మద్యం అధికంగా తీసుకోవడం వల్ల మరుసటి రోజు పలకరించే హ్యాంగోవర్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తలనొప్పి, అలసట, కండరాల నొప్పులు, తీవ్రమైన దాహం,( Headache, Fatigue, Muscle Aches, Extreme Thirst ) వాంతులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, గందరగోళం, మానసిక ఆందోళన, ఆకలి మందగించడం.
ఇవన్నీ హ్యాంగోవర్ లక్షణాలు.న్యూ ఇయర్ పార్టీ తర్వాత ఈ హ్యాంగోవర్ నుంచి బయటపడటం పెద్ద సవాల్ గా ఉంటుంది.
అయితే హ్యాంగోవర్ బారిన పడ్డాక ఇబ్బంది పడేకన్నా.దానికి ఉండటం చాలా ఉత్తమం.
హ్యాంగోవర్ కు దూరంగా ఉండాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. """/" /
ముఖ్యంగా మద్యాన్ని మితంగా తీసుకోవాలి.
హ్యాంగోవర్ ( Hangover )నివారించడానికి ఉత్తమమైన మార్గం ఇది.అలాగే హ్యాంగోవర్ కు దూరంగా ఉండాలంటే ఖాళీ కడుపుతో మద్యం తీసుకోరాదు.
ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తే అది శరీరంలో త్వరగా కలసిపోతుంది.అందుకే ఆహారం తిన్న తర్వాతే ఆల్కహాల్ తీసుకోవాలి.
కొందరు పలు రకాల ఆల్కహాల్స్ మిక్స్ చేసి తీసుకుంటారు.మరికొందరు షుగర్ ఫ్రీ డ్రింక్స్ ను కలిపి తీసుకుంటారు.
ఇది హ్యాంగోవర్ రిస్క్ ను పెంచుతుంది. """/" /
హ్యాంగోవర్ కు దూరంగా ఉండాలనుకుంటే.
తక్కువ ఆల్కహాల్ శాతం( Alcohol Percentage ) ఉన్న పానీయాలు ఎంచుకోండి.రెడ్ వైన్, బ్రాండి వంటి డార్క్ లిక్కర్స్ ను ఎవైడ్ చేయండి.
మద్యాన్ని వేగంగా తాగడం వల్ల హ్యాంగోవర్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల చిన్న చిన్న విరామాలు ఇవ్వాలి.
మద్యం సేవిస్తూనే వాటర్ ను కూడా తీసుకోవాలి.అంటే మద్యం తాగే ప్రతి గ్లాసుకు మధ్య ఒక గ్లాసు నీరు తాగాలి.
తద్వారా బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది.హ్యాంగోవర్ రిస్క్ తగ్గుతుంది.
యూఏఈలోని ఎన్ఆర్ఐలకు అలర్ట్ .. పాస్‌పోర్ట్ రెన్యూవల్ గైడ్‌లైన్స్ చూశారా?