మీరు వైఫై వాడినట్టయితే ఈ జాగ్రత్తలు పాటించండి, లేదంటే అంతే!

ప్రస్తుత స్మార్ట్ యుగంలో దాదాపు ప్రతి ఒక్కరూ కమ్యూనికేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, వర్క్, ట్రాన్సాక్షన్స్ కోసం ఇంటర్నెట్‌పైన ఆధారపడాల్సిన పరిస్థితి.

ఇక కరోనా మహమ్మారి పుణ్యమాని ఇంటి నుంచి పని చేసి వారి సంఖ్య పెరగడంతో వైఫైలు పెట్టించడం అనివార్యం అయింది.

ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఫై యూజర్లు( WiFi Users ) తమ ఆన్‌లైన్ భద్రతను ప్రమాదంలో పడేసే 2 కామన్ మిస్టేక్స్ చేస్తున్నారని ఇటీవలి కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అయితే వీటిని ఫిక్స్ చేసుకోవడం ఇపుడు చాలా తేలిక అని నిపుణులు చెబుతున్నారు.

"""/" / వైఫై యూజర్లు చేస్తున్న మొదటి మిస్టేక్ ఏమంటే, హోమ్ వైఫై రూటర్‌కు ( Home WiFi Router )స్ట్రాంగ్ యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌ను సెటప్ చేయకపోవడం.

ఇది సెట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.ఎందుకంటే, రూటర్‌ యూజర్ ప్రైవేట్ సమాచారాన్ని మేనేజ్ చేస్తుంది.

అంతేకాకుండా హోమ్ వైఫై రూటర్ నెట్‌వర్క్‌లోని ఇంటర్నెట్ ట్రాఫిక్ ఫ్లోని నియంత్రించడానికి కూడా ఇది బాధ్యత వహిస్తుంది.

ఇంత కీలకమైన రూటర్ సెట్టింగ్స్‌ సరిగ్గా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ఎరిచ్ క్రోన్ ( Security Expert Erich Krone )తాజాగా ఓ మీడియా వేదికగా పేర్కొన్నారు.

"""/" / ఆయన చెబుతున్నదేమంటే, వైఫై యూజర్లు చాలా ప్రత్యేకంగా ఉండే లాగిన్ క్రెడెన్షియల్స్‌ సెటప్ చేసుకోవాలి.

వైఫై రూటర్లు డిఫాల్ట్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో వస్తాయి.కాబట్టి వీటిని సులభంగా గెస్ చేయవచ్చు.

ఇలాంటి సింపుల్ పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు ఈజీగా తెలుసుకొని దెబ్బతీస్తారు కాబట్టి వాటిని వెంటనే మార్చేయడం ఉత్తమం.

ఇక రెండో మిస్టేక్ గురించి చెప్పుకోవాలంటే, ఇది కూడా చాలామంది చేస్తారు.వైఫై నెట్‌వర్క్‌కు పేరు పెట్టేటప్పుడు, ఇంటి పేరు వంటి వ్యక్తిగత సమాచారం లాంటిది వాడకూడదు.

అందుకు బదులుగా, ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని అందించని ఏదైనా క్రియేటివ్ నేమ్ పెట్టుకోవడం ఉత్తమం.

వైరల్ వీడియో: తలుపు తెరిస్తే ఎదురుగా భీకరమైన పులి.. చివరికేమైందో చూస్తే షాక్!