పసుపు దంతాలతో చింతేలా.. ఈ పవర్ ఫుల్ టిప్స్ తో సులభంగా తెల్లగా మార్చుకోండి!

తెల్లటి మెరిసే దంతాలను ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.కానీ అందరికీ అటువంటి దంతాలు ఉండవు.

చాలా మంది దంతాలు పసుపు రంగులో అసహ్యంగా కనిపిస్తుంటాయి.ఇలాంటివారు దంతాలను తెల్లగా మార్చుకునేందుకు ఖరీదైన టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటారు.

అయితే ఎన్ని రకాల టూత్ పేస్ట్ లను వాడినా దంతాలు తెల్లగా మారడం లేదా.

? చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ టిప్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి.

ఈ టిప్స్ తో వేగంగా మరియు సులభంగా తెల్లటి మెరిసే దంతాలను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంతకీ ఆ చిట్కాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. """/" / పసుపు-ఆవనూనె.

ఈ రెండిటిలో దంతాలను ముత్యాల మాదిరి మెరిపించుకోవచ్చు.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు మరియు రెండు టేబుల్ స్పూన్లు ఆవనూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను తోముకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి కనుక ఇలా చేస్తే పసుపు దంతాలు క్రమంగా తెల్లబడతాయి.

ఆవనూనె, పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంతాల ఆరోగ్యానికి కవచంగా మారతాయి.

అలాగే నిత్యం బ్రష్ తోనే కాకుండా వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు అయినా వేప పుల్ల‌తో పళ్ళను తోముకోండి.

దంతాలపై పసుపు రంగును పోగొట్టి తెల్లగా మార్చే సామర్థ్యం వేప పుల్లకు ఉంటుంది.

పైగా వేప పుల్లతో పళ్ళను తోముకుంటే దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తస్రావం, దంతాలు జివ్వుమని లాగడం వంటి సమస్యలు దూరం అవుతాయి, """/" / జామ ఆకులు కూడా దంతాల ఆరోగ్యానికి సహాయపడతాయి.

జామ ఆకులను నమ‌లడం ద్వారా పసుపు దంతాలు తెల్లగా మారతాయి.నోటి నుంచి దుర్వాసన సైతం రాకుండా ఉంటుంది.

ఇక మరొక సూపర్ టిప్ ఏంటంటే.ఒక బౌల్ తీసుకొని అందులో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టేబుల్ స్పూన్ లవంగాల పొడి, వన్ టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఉపయోగించి దంతాలను తోముకోవాలి.ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

జేఎన్టీయూహెచ్ కిచెన్‌లో పిల్లి ప్రత్యక్షం.. ఎలుక కోసమే వచ్చిందంటూ నేతలు జోకులు..!