చేతుల నలుపుతో చింతేలా.. ఈ చిట్కాలు పాటించండి!
TeluguStop.com
సాధారణంగా కొందరికి శరీరం మొత్తం ఒక రంగులో ఉంటే చేతులు ( Hands ) మాత్రం నల్లగా కాంతిహీనంగా కనిపిస్తుంటాయి.
అయితే ఎక్కువ శాతం మందిలో ఇందుకు ఎండల ప్రభావం ప్రధాన కారణంగా మారుతుంటుంది.
సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలకు గురికావడం వల్ల చేతులు నల్లగా తయారవుతుంటాయి.
దాంతో చేతుల నలుపును( Dark Hands ) చూసుకుంటూ తెగ వర్రీ అయిపోతుంటారు.
కానీ చింతించవద్దు.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాలను కనుక పాటిస్తే నల్లగా మారిన చేతులను మళ్లీ తెల్లగా మరియు కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.
"""/" /
టిప్-1: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ తురుము,( Cucumber ) రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టించి పది నిమిషాలు పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చేతులను ఐదు నిమిషాల పాటు బాగా స్క్రబ్బింగ్ చేసుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేశారంటే నలుపు మొత్తం మాయం అవుతుంది.
చేతులు తెల్లగా మృదువుగా మారతాయి. """/" /
టిప్-2: ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు చందనం పొడిని( Sandalwood Powder ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ) మరియు సరిపడా రోజ్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చేతలకు పూతలా అప్లై చేసుకుని ఆరబెట్టుకోవాలి.పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటర్ తో వాష్ చేసుకోవాలి.
ఈ రెమెడీ కూడా నలుపును వదిలిస్తుంది.చేతులను వైట్ గా, బ్రైట్ గా మెరిపిస్తుంది.
"""/" /
టిప్-3: ఇక నిమ్మరసం మరియు పంచదారను ఉపయోగించి కూడా డార్క్ హాండ్స్ కు బై బై చెప్పవచ్చు.
అందుకోసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పంచదారలో మూడు టేబుల్ స్పూన్లు నిమ్మరసం కలపాలి.
ఈ మిశ్రమాన్ని చేతులకు అప్లై చేసి సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఐదు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం.. ఏ శాఖకు ఎన్ని కోట్లంటే?