తన డైట్ సీక్రెట్ రివీల్ చేసిన కరీనా కపూర్

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అందాల భామ కరీనా కపూర్.

ఈ అమ్మడు సినిమాలు చేస్తూనే సైఫ్ అలీ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

పెళ్లి చేసుకున్న తర్వాత గ్యాప్ లేకుండా మొదటి బిడ్డని కనేసింది.బిడ్డని కన్న కొద్ది రోజులకే మరల ఈ భామ రికవరీ అయిపోయి సినిమాలు చేసుకుంటూ వస్తుంది.

ఇదిలా ఉంటే రెండు వారల క్రితం కరీనా కపూర్ మరో బిడ్డకి జన్మనిచ్చింది.

హాస్పిటల్ లో డెలివరీ అయినప్పటి ఫోటోని ఈ అమ్మడు షేర్ చేసుకుంది.ఇదిలా ఉంటే రెండు వారాలలో మరల యధావిధిగా తన మునుపటి అందంతో కొత్త లుక్ కి సంబంధించి ఫోటోలని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

అయితే బిడ్డని కన్న రెండు వారాలకే మరల కరీనా కపూర్ మునుపటి రూపానికి ఎలా వచ్చేసింది.

అంత వేగంగా ఎలా రికవరీ అయ్యింది అనే డౌట్ అందరికి వస్తుంది.ఈ నేపధ్యంలో కరీనా కపూర్ డైట్ సీక్రెట్ ని ఆమె న్యూట్రిషనిస్ట్ బయటపెట్టారు.

మితంగా ఎక్కువసార్లు తినడం, రెగ్యులర్ గా వ్యాయామాలు చేయడం కరీనా కపూర్ సీక్రెట్ అని చెప్పుకొచ్చారు.

లేచిన వెంటనే కుంకుమ పువ్వుతో కలిపిన నల్లటి ఎండుద్రాక్షను కరీనా తింటుంది ఆ తరువాత బ్రేక్ ఫాస్ట్ లో పరాఠా-చట్నీ తింటుంది.

లంచ్ కి ముందు కొన్ని సబ్జా గింజలు తిని కొబ్బరినీళ్లు తాగుతుంది.ఇక మధ్యాహ్నం భోజనం కింద కేవలం పెరుగన్నం, అప్పడం తింటుంది.

ఆ తరువాత కొంచెం గ్యాప్ ఇచ్చి వాల్ నట్స్, చీజ్ తీసుకుంటుంది.సాయంత్రం బనానా మిల్క్ షేక్ తాగుతుంది.

రాత్రికి డిన్నర్ లో వెజ్ పులావ్ తో పాటు కంద, పెరుగు తింటుంది.

పడుకునే ముందు పాలు లేదా బనానా మిల్క్ షేక్ తాగుతుంది.ఇలా రోజులో ఎనిమిది సార్లు ఆహరం తీసుకుంటూ ఎక్సర్ సైజ్ చేయడం వలన కరీనా మంచి ఫిజిక్ ను మైంటైన్ చేయగలుగుతుంది.

వారానికి పది గంటలు వ్యాయామాలు, అంతే సమయం యోగా చేస్తూ తన ఫిట్నెస్ ను కాపాడుకుంటుందని పేర్కొంది.

ఈ కారణంగానే ఆమె డెలివరీ అయిన తర్వాత కూడా వేగంగా రికవరీ అయ్యారని ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్28, శనివారం 2024