ఈ ఫుడ్స్ తీసుకుంటే గర్భిణీలు సహజంగానే ఫోలిక్ యాసిడ్ ను పొందవచ్చు.. తెలుసా?
TeluguStop.com
ఫోలిక్ యాసిడ్/ఫోలేట్.( Folic Acid ) విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒకటైన విటమిన్ బి9.
ప్రెగ్నెన్సీ ( Pregnancy ) సమయంలో మహిళలకు అత్యంత అవసరమయ్యే పోషకాల్లో ఫోలిక్ యాసిడ్/ఫోలేట్ ఒకటి.
గర్భంలో పిండం ఎదగాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఫోలిక్ యాసిడ్ ఎంతో ముఖ్యం.గర్భంలో శిశువు మెదడు, వెన్నుముక అభివృద్ధికి ఫోలిక్ యాసిడ్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
అలాగే గర్భిణీలో ఐరన్ లోపాన్ని నివారించడానికి కూడా హెల్ప్ చేస్తుంది.ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా అందితే బిడ్డ ఎలా లోపాలు లేకుండా పుడుతుంది.
అందుకే డాక్టర్లు గర్భం దాల్చిన ప్రతి మహిళకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ను ప్రిఫర్ చేస్తుంటారు.
అయితే గర్భిణీలు సహజంగా కూడా ఫోలిక్ యాసిడ్ ను పొందవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు ఉత్తమంగా సహాయపడతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి. """/" /
పాలకూర.
( Spinach ) ఆకుకూరల్లో అద్భుతమైనది.ఫోలిక్ యాసిడ్ పాలకూరలో పుష్కలంగా ఉంటుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు పాలకూరను ప్రతిరోజు ఏదో ఒక రూపంలో తీసుకోవాలి.తద్వారా ఫోలిక్ యాసిడ్ తో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఎన్నో విలువైన పోషకాలు లభిస్తాయి.
పాలకూర తో పాటు మిగిలిన ఆకుకూరలు కూడా తీసుకోవాలి.అలాగే ఫోలిక్ యాసిడ్ ను సహజంగానే పొందాలని భావించే గర్భిణీలు బీన్స్ ను( Beans ) తీసుకోండి.
బీన్స్ లో కూడా ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. """/" /
బనానా, ఆరెంజ్, పుచ్చకాయ, మామిడి, అవకాడో వంటి పండ్లలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది.
కాబట్టి ఈ ఫ్రూట్స్ ను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో మహిళలు ఎక్కువగా తీసుకునేందుకు ప్రయత్నించాలి.
అలాగే గర్భం తో ఉన్న మహిళలు పప్పు ధాన్యాలు, నట్స్, గుడ్లు, బ్రోకలీ, స్వీట్ కార్న్, బీట్ రూట్, ఆకుపుచ్చ రంగులో ఉండే కూరగాయలు, లెమన్, క్యాబేజీ, స్పింగ్ గ్రీన్స్, రాజ్మా వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.
వీటి ద్వారా సహజంగానే ఫోలిక్ యాసిడ్ ను పొందవచ్చు.
డాకు మహారాజ్ మూవీలో తన నటనతో మెప్పించిన ఈ చిన్నారి ఎవరో మీకు తెలుసా?