వర్షాకాలంలో సాగు చేసుకోదగ్గ పశుగ్రాసాలు ఇవే..!
TeluguStop.com
వ్యవసాయం( Agriculture ) చేసే రైతులు వ్యవసాయం తో పాటు పాడిపరిశ్రమకు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు.
పాడికి ఆధారం పచ్చి మేతలు, కాబట్టి పచ్చిమితలకు కొదవ లేకుండా గేదెలను మేపినప్పుడే రైతులకు పోషణ వ్యయం తగ్గి, గిట్టుబాటు అవుతుంది.
పచ్చి మేతలను ఎంత సమృద్ధిగా అందిస్తే పాడి పరిశ్రమలో అంతలా లాభాలు వస్తాయి.
పాల దిగుబడి, వెన్న శాతం బాగా పెరుగుతుంది.సాధారణంగా ప్రతిరోజు పశువుకు 30 కిలోల పచ్చి మేత అవసరం.
అయితే చాలామంది రైతులకు సరైన అవగాహన లేక పశుగ్రాసాలను సాగు చేయడంలో విఫలం అవుతున్నారు.
అయితే వర్షాకాలంలో ఏ పశుగ్రాసాలను సాగు చేయాలి.ఎంత స్థలంలో సాగు చేయాలి అనే వివరాలు తెలుసుకుందాం.
పాడి పశువులు ఉన్న ప్రతి రైతు 10 సెంట్ల భూమిలో ఈ పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి.
పాలిచ్చే ఆవులు లేదా గేదలు ఉంటే కనీసం 25 సెంట్ల భూమిలో పశుగ్రాసాలను సాగు చేసుకోవాలి.
"""/" /
ఒక్కొక్క పాడిపశువుకు ప్రతిరోజు 20 కిలోల ధాన్యపు జాతి పచ్చి గడ్డి, పది కిలోల లెగ్యుమ్ జాతి పచ్చి గడ్డి, 6 కిలోల ఎండు గడ్డి, మూడు కిలోల దాణా ఇవ్వాలి.
వర్షాకాలంలో( Rainy Season ) నీరు పుష్కలంగా ఉండే నెలలలో హైబ్రిడ్ నేపియర్ గడ్డిని సాగు చేసుకోవచ్చు.
ఈ హైబ్రిడ్ నేపియర్ లో చాలా రకాలు ఉన్నాయి.ఒక ఎకరం పొలంలో 12 వేల కాండపు మొక్కలు నాటుకోవాలి.
ఈ మొక్కలను పొలంలో బోదేకు ఒకపక్కగా ఏటవాలుగా నాటుకోవాలి.బోదేల మధ్య 60 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.
నాటిన 70 రోజులకు పచ్చి గడ్డి కోతకు సిద్ధంగా ఉంటుంది.మొదటి కోత తర్వాత ప్రతి 40 రోజులకు ఒకసారి కోత కోయవచ్చు.
"""/" /
మెట్ట ప్రాంతాలలో అయితే గాని గిని, గిని మౌన గాని, గిని బ్రౌన గాని, గిని మంబాసా గాని, గిని జూరి గాని లాంటి పశుగ్రాసాలను సాగు చేసుకోవచ్చు.
వర్షాలు బాగా పడే ముంపుడు ప్రాంతాలలో పారా గడ్డి( Para Grass )ని సాగు చేసుకోవచ్చు.
పశుగ్రాస మొక్కలైన అవిసగింజ మొక్కలు, సుబాబుల్ మొక్కలను ఇంటి పెరటిలో గాని, పొలాల గట్లపై కానీ వేసుకొని వాటి రెమ్మలను సూర్యరశ్మిలో ఆరబెట్టి ఆ తర్వాత మూడు కేజీల ఎండుమితతో కలిపి పశువులకు మేతగా వేయాలి.
లేగ్యుమ్ జాతి H3 Class=subheader-styleపశుగ్రాసాలు:/h3p పిల్లి పెసర, అలసంద, జనుము( Janumu )ధాన్యపు జాతి పశుగ్రాసాలు: తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు, కాకి జొన్నలు, మొక్కజొన్నలు.