అందమైన నెమళ్లకు వెరైటీ పోటీలు.. వీడియో వైరల్

చిన్నతనంలో నెమలీకలను పుస్తకాల్లో పెట్టుకుని చాలా మంది దాచుకుని ఉంటారు.కొన్నాళ్లకు కొత్తవి పుట్టుకొచ్చాయని తెలిసి బాగా సంబరపడిపోయిన మధుర స్మృతులు అందరికీ ఉంటాయి.

ఇక ఎక్కడైనా పూర్తిగా నెమలి పింఛాన్ని చూస్తే, దానిని కొనే వరకు పిల్లలు నిద్రపోరు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడైనా నెమలి నేరుగా కనిపిస్తే చాలా మంది చూస్తూ ఉండిపోతారు.

అది పురివిప్పి నాట్యం చేస్తే పెద్దలు సైతం మైమరచిపోతుంటారు.కనురెప్పలు వేయకుండా అలాగే వీక్షిస్తూ ఉంటారు.

అంతలా నెమలి నాట్యానికి పేరుంది.కవులు సైతం తమ కవిత్వాల్లో నెమలి నాట్యానికి ప్రత్యేక స్థానం కల్పిస్తుంటారు.

ఇలాంటి నెమళ్లకు ఎగిరే పోటీలు నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం ఆ వీడియోలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి.

దానికి సంబంధించిన ఆసక్తికర కథనమిలా ఉంది.మిగిలిన ఇతర పక్షులలాగానే నెమళ్లు కూడా ఎగరగలవు.

అయితే తమ బరువు వల్ల ఎక్కువ దూరం, ఎక్కువ ఎత్తు ఎగరలేవు.ఏదైనా ఒకటి రెండు నెమళ్లు కనిపిస్తేనే చాలా కనువిందుగా అనిపిస్తుంది.

అలాంటిది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఏఖంగా ఓ నెమళ్ల గుంపే ఎగురుతూ కనిపిస్తుంది.

సరస్సులో ఒక ఒడ్డు నుంచి మరో ఒడ్డుకు అవి ఎగురుతున్న తీరు అందరినీ ఆకర్షిస్తోంది.

"""/"/ సమీపంలో ఓ చూడచక్కని పార్కు ఉంది.చాలా మంది ప్రేక్షకులు కూడా నెమళ్లను చూస్తున్నారు.

దీంతో ఇది నెమళ్లకు ఎగిరే పోటీ అయి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఏదేమైనా ఇంటర్‌నెట్‌లో చాలా మందిని ఈ వీడియో ఆకర్షించింది.

ట్విట్టర్‌లో వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.ఎంతో అందంగా ఉందంటూ కితాబిస్తున్నారు.

యోగా ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్‌గా మారింది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ..!!