చార్ ధామ్ యాత్రలో పెల్లుబికిన భక్తుల ప్రవాహం..లక్షలకు పైగా భక్తులు..?
TeluguStop.com
హిందువులు చార్ ధామ్ యాత్రను( Char Dham Yatra ) చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
తమ జీవితంలో ఒక్కసారి అయినా చార్ ధామ్ యాత్రను చేయాలని అనుకుంటారు.ఈ విధంగా ప్రతి సంవత్సరం చార్ ధామ్ యాత్రకు భక్తులు తరలి వస్తూ ఉంటారు.
చార్ ధామ్ అంటే కేదార్ నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి లను చుట్టి రావడమే.
ఈ చార్ ధామ్ యాత్రతో పాటు ఇతర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు కూడా ఈ సంవత్సరంలో భక్తుల తాకిడి ఎదురయింది.
"""/" /
అయితే ఈ సంవత్సరంలో ఏ ధామాన్ని సందర్శించడానికి ఎంత మంది భక్తులు వచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
మీడియా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం దాదాపు 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ ధామ్ యాత్ర చేయడానికి వచ్చారు.
2021 లో సుమారు 5 లక్షల 18 వేల మంది భక్తులు ఈ యాత్ర కోసం వచ్చారు.
ఇక 2022లో ఈ సంఖ్య 46 లక్షల 27 వేలకు దాటింది.ఇక ఈ సంవత్సరం అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య 50 లక్షలు దాటడం విశేషం అని చెప్పవచ్చు.
అలాగే ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ధామ్ 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా పరిగణిస్తారు.ఇక ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తులు రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇక్కడికి చేరుకోవడానికి హెలికాప్టర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.ఇక ఈ సంవత్సరం 19 లక్షల 61 వేల మందికి పై భక్తులు కేదార్నాథ్ తీర్థయాత్ర ( Kedarnath )చేశారు.
ఈ సంవత్సరంలో కేదార్నాథ్ తలుపులు ఏప్రిల్ 25న తెరుచుకున్నాయి.అలాగే యాత్ర నవంబర్ 15న ముగిసింది.
విష్ణు భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించడాన్ని ఒక వరంగా భావిస్తారు.ఈ సంవత్సరం బద్రీనాథ్ యాత్ర ఏప్రిల్ 27న ప్రారంభమై, నవంబర్ 15న ముగిసింది.
ఇక ఈ సంవత్సరం బద్రీనాథ్ కి వచ్చిన భక్తుల సంఖ్య 18 లక్షల 34 వేల మంది.
ఈ ఏడాది తొమ్మిది లక్షల 5 వేల మందికి పైగా భక్తులు గంగోత్రి యాత్రను కూడా పూర్తి చేసుకున్నారు.
"""/" /
ఈ సంవత్సరంలో గంగోత్రి యాత్ర( Gangotri Yatra ) ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై నవంబర్ 14న ముగిసింది.
ఇక ప్రతి సంవత్సరం గంగోత్రి యాత్ర ప్రారంభం అవ్వగానే గంగమ్మ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు అక్కడికి తరలి వచ్చారు.
2 నెలల్లో జుట్టును దట్టంగా మార్చే పవర్ ఫుల్ సీరం ఇది.. ఈజీగా తయారు చేసుకోండిలా!