గోధుమ ఎగుమతులపై ఇండియా నిషేధం .. సింగపూర్‌లో చపాతీల కోసం భారతీయుల కటకట

కొద్దిరోజుల క్రితం గోధుమల ఎగుమతులపై భారతదేశం నిషేధం విధించడంతో ప్రపంచం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.

ఎన్నో దేశాలు భారత్ నిర్ణయాన్ని తప్పుబట్టాయి.ఇప్పటికే ఆహార సంక్షోభం వేధిస్తున్న నేపథ్యంలో భారత్ తీరుపై విమర్శలు గుప్పించాయి.

అయినప్పటికీ జాతి ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని మోడీ ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడే వుంది.

కొన్ని దేశాల అభ్యర్ధనల మేరకు వాటికి మాత్రం సడలింపు ఇచ్చింది.అయితే గోధుమలపై నిషేధం కారణంగా సింగపూర్‌లో స్థిరపడిన భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా చపాతీలను మాత్రమే ఆహారంగా తీసుకునే పంజాబీలకు ఇది శరాఘాతంగా తగిలింది.ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అటు నుంచి రావాల్సిన గోధుమలు నిలిచిపోవడం, భారత్ కూడా ఎగుమతులపై నిషేధం విధించడంతో సింగపూర్‌లో గోధుమల ధర మూడు రెట్లు పెరిగింది.

స్థానిక సూపర్ మార్కెట్ చైన్ ఫెయిర్ ప్రైస్ ప్రకారం.గత కొన్ని వారాల్లో గోధుమలకు, గోధుమ పిండికి విపరీతంగా గిరాకీ ఏర్పడిందని, కానీ దానికి తగ్గ సప్లయ్ మాత్రం లేదని నిపుణులు చెబుతున్నారు.

దీనికి భారత్ విధించిన నిషేధమే కారణమంటున్నారు.శ్రీలంక, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా తదితర దేశాల నుంచి ఫెయిర్ ప్రైస్‌ గోధుమ పిండిని దిగుమతి చేసుకుంటోంది.

గోధుమ పిండి కొరత కారణంగా తమ వ్యాపారం చాలా దెబ్బతింటోందని స్థానిక లిటిల్ ఇండియా ఆవరణలోని తినుబండారాల సంస్థ శకుంతల ఎండీ మాధవన్ ఆది బాలకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో తమ రెస్టారెంట్ భారత్ నుంచి గోధుమ పిండి కోసం కేజీకి 5 సింగపూర్ డాలర్లు చెల్లించేదని.

కానీ ఇప్పుడు దుబాయ్ నుంచి వచ్చే గోధుమ పిండి ధర 15 సింగపూర్ డాలర్లుగా వుంటోందని మాధవన్ అన్నారు.

ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.సింగపూర్ ప్రతి ఏటా 2,00,000 నుంచి 2,50,000 టన్నుల గోధుమలను.

1,00,000 నుంచి 1,20,000 టన్నుల గోధుమ పిండిని దిగుమతి చేసుకుంటోంది.2020వ సంవత్సరంలో సింగపూర్ మొత్తం గోధుమ పిండి దిగుమతుల్లో 5.

8 శాతం భారత్ నుంచి వచ్చిందని ది బిజినెస్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

అత్యధికంగా ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాల నుంచి సింగపూర్ గోధుమ పిండిని దిగుమతి చేసుకుంటోంది.

భారత్ నుంచి వచ్చేది స్వల్పమే అయినప్పటికీ.ఇక్కడి భారతీయ రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం ఇండియా నుంచే గోధుమ పిండిని దిగుమతి చేసుకుంటూ వుండటమే సమస్యకు కారణం.

"""/" / కాగా.గోధుమల ఉత్పత్తికి సంబంధించి ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో వుంది.

అయితే ఈ ఏడాది దేశంలో గోధుమ దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది.మే 13 నాటికి ఎఫ్‌సీఐ కేవలం 17 మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించింది.

గతేడాదితో పోలిస్తే ఇది సగమే.ఉత్తర, పశ్చిమ, మధ్య ప్రాంతాల్లో వీస్తున్న వేడి గాలులే గోధుమ దిగుబడి తగ్గడానికి కారణమని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

గోధుమ ఉత్పత్తుల్లో రష్యా తొలి స్థానంలో వుండగా.ఉక్రెయిన్‌ నాలుగో స్థానంలో వుంది.

ప్రస్తుతం యుద్ధం కారణంగా ఆ రెండు దేశాల నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి.దీంతో ప్రపంచం భారత్ వైపు ఆశగా ఎదురుచూస్తోంది.

ఇలాంటి పరిస్ధితుల్లో భారత్ ఎగుమతులపై నిషేధం విధించడం ఆయా దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఝార్ఖండ్ లో ఈడీ సోదాలు.. భారీగా నగదు పట్టివేత