అమెరికా : జో బైడెన్ కుమార్తె డైరీ చోరీ, ఆపై విక్రయం.. ఫ్లోరిడా మహిళకు జైలుశిక్ష

అమెరికా అధ్యక్షుడు, ఆయన కుటుంబానికి ఏ స్థాయిలో భద్రత వుంటుందో అందరికీ తెలిసిందే.

అనుమతి లేనిదే ఈగ కూడా లోపలికి రాలేని స్థాయిలో సెక్యూరిటీని అందిస్తారు సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు.

అలాంటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) కుమార్ యాష్లే బైడెన్ ( Ashley Biden ) డైరీని దొంగిలించింది, విక్రయించిందో మహిళ.

ఫ్లోరిడాకు చెందిన ఐమీ హారిస్‌కు ఈ నేరానికి గాను నెల రోజుల జైలు శిక్ష, మూడు నెలల గృహ నిర్బంధం విధించారు.

నాలుగేళ్ల క్రితం ఆ డైరీని కన్జర్వేటివ్ గ్రూప్ ప్రాజెక్ట్ వెరిటాస్‌కు విక్రయించినట్లు హారిస్‌పై అభియోగాలు మోపారు.

మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి లారా టేలర్ స్వైన్.హారిస్ చర్యలను నీచమైనదిగా అభివర్ణించారు.

యాష్లే.వ్యక్తిగత రచనలను విక్రయించినందుకు ఐమీ హారిస్ కన్నీటితో క్షమాపణలు చెప్పింది.

తాను చట్టానికి అతీతుడను కాను.తన 8, 6 ఏళ్ల వయసున్న పిల్లలను చూసుకోవడంలో నిమగ్నమైపోయి.

శిక్ష విధించే తేదీలలో కోర్టుకు గైర్హాజరైనట్లు పేర్కొంది.తాను దీర్ఘకాలిక గృహ వేధింపులు, లైంగిక గాయానికి ( Domestic Violence, Sexual Assault )గురైనట్లు హారిస్ న్యాయమూర్తికి చెప్పారు.

యాష్లే బైడెన్ తరపున న్యాయవాది కోర్టులోనే వుండటంతో .ఆమె వ్యక్తిగత జీవితాన్ని బహిరంగపరిచినందుకు విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పింది హారిస్.

జూలైలో ఆమె జైలు బయటకు రిపోర్టు చేయాల్సి వుంటుంది. """/" / ఐమీ ఫ్లోరిడాలో నివసిస్తున్నారు.

డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో యాష్లే బైడెన్ డైరీ, డిజిటల్ స్టోరేజ్ కార్డ్, పుస్తకాలు, దుస్తులు , సామాన్లు ఇలా అన్నింటిపై కన్నేసింది.

2020లో ఫ్లోరిడాలోని స్నేహితుని డెల్రే బీచ్‌లో( Delray Beach ) యాష్లే బస చేశారు.

ఆ సమయంలో తన వస్తువులను సురక్షితంగా అక్కడ భద్రపరిచారని బైడెన్ కుమార్తె విశ్వసించింది.

ఆగస్టు 2022లో హారిస్ కుట్ర అభియోగాన్ని అంగీకరించింది. """/" / యాష్లే బైడెన్ వ్యక్తిగత వస్తువుల కోసం ప్రాజెక్ట్ వెరిటాస్ చెల్లించిన 40 వేల డాలర్లలో 20 వేల డాలర్లు అందుకున్నట్లు అంగీకరించింది.

ఐమీ హారిస్‌తో పాటు మరో ప్రతివాది ఫ్లోరిడాలోని జూపిటర్‌కు చెందిన రాబర్ట్ కుర్లాండర్.

యాష్లే బైడెన్ వస్తువులను 2020 అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారానికి విక్రయించేందుకు యత్నించారు.

2010లో స్థాపించబడిన ప్రాజెక్ట్ వెరిటాస్ తనను తాను ఒక వార్తాసంస్థగా అభివర్ణించుకుంది.వార్తాకేంద్రాలు, కార్మిక సంస్థలు, డెమొక్రాటిక్ రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టే రహస్య పరిశోధనలకు ప్రఖ్యాతి గాంచింది.

వార్ 2 లో ఎన్టీయార్ ఎంత సేపు కనిపిస్తాడు..?