ఈ కుక్క వయసు ఎంతో మీకు తెలుసా...??

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.వీటిలో యానిమల్ వీడియోలు బాగా ఆకట్టుకుంటాయి.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కుక్కకి చెందిన వీడియో వైరల్ అవుతోంది.

సాధారణంగా కుక్కల జీవితకాలం 10 నుంచి 13 ఏళ్లు వరకు ఉంటుంది.అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కుక్కకు మాత్రం ఏకంగా 21 ఏళ్లు ఉన్నాయి.

అత్యధిక వయసు గల కుక్కగా ఈ కుక్క గిన్నిస్ రికార్డ్ కూడా సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది.

వివరాల్లోకి వెళితే.అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన చివావా అనే ఒక కుక్క వయసు 21 ఏళ్లు.

ఇన్ని ఏళ్లు ఏ కుక్క జీవించలేదు.దీనితో లాంగెస్ట్ లివింగ్ డాగ్ గా ఇది ప్రపంచ రికార్డు సాధించింది.

చువావా అనేది ఆ కుక్క పేరు.టోబీకీత్ జాతికి చెందిన ఈ కుక్క జనవరి 9, 2001న జన్మించింది.

ప్రస్తుతం దీని వయస్సు 21 సంవత్సరాల 97 రోజులుగా ఉంది.గ్రీన్‌కర్స్‌కి చెందిన గిసెలా షోర్ అనే మహిళ టోబికీత్‌ను జంతువుల ఆశ్రమం నుంచి దత్తత తీసుకున్నారు.

దత్తత తీసుకున్న దగ్గర నుంచి తనతో పాటు ఈ టోబికిత్ కూడా నివసిస్తోందని ఆమె తెలిపారు.

"""/"/ తన జీవితంలో ఈ పెంపుడు కుక్కకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని గిసెలా షోర్ తెలిపారు.

తన పెంపుడు కుక్క గిన్నిస్ బుక్ రికార్డ్ లో చోటు సంపాదించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు.

గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్న చువావా శునకం వీడియోను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.ఈ కుక్క చూడడానికి భలే ముద్దుగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

తొలి సినిమాతోనే మోక్షజ్ఞకు ఊహించని సవాళ్లు.. వాటిని అధిగమించడం సులువు కాదుగా!