అగ్ర రాజ్యానికి ఇది అవమానమే...పరిస్థితి చేయిదాటిపోతోందా...??

అమెరికాలో కరోనా మహమ్మారి డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది.డెల్టా వ్యాప్తితో అమెరికా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యంగా ఫ్లోరిడా రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లోరిడా పై మహమ్మారి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోందని అక్కడి వైద్య నిపుణులు వాపోతున్నారు.

రోజుకు 80 నుంచీ 1 లక్ష వరకూ కేసులు నమోదు అవుతున్నాయని, రోజుకు 250 మంది వరకూ మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే కరోన కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నా సరే ప్రభుత్వం అక్కడి వైద్య సదుపాయాలపై దృష్టి పెట్టడంలేదని తెలుస్తోంది.

అమెరికా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ప్రస్తుతం డెల్టా ప్రభావం తీవ్రంగా ఉండగా, రోజుకు వేల సంఖ్యలో రోగులు చేరుతున్నారని అయితే వారికి ఆక్సిజన్ అందించడానికి అక్కడి ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు నిండుకున్నాయని రోగులకు సరైన వైద్యం అందించలేక పోతున్నట్లుగా తెలుస్తోంది.

ఫ్లోరిడా వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో కేవలం రెండు రోజులకు సరిపడగానే ఆక్సిజన్ అందుబాటులో ఉందని, తరువాత పరిస్థితి తలుచుకుంటేనే ఆందోళనగా ఉందని వైద్యులు వాపోతున్నారట.

అమెరికాలో రోజులు దాదాపు 1000 మందికి పైగా రోగులు కరోనాతో మృతి చెందుతున్నారని, వేల కేసులు నమోదు అవుతున్నట్లుగా తెలుస్తోంది.

ఫ్లోరిడాలో దాదాపు ఐదు ప్రాంతాలలో ఆక్సిజన్ లేక అల్లాడిపోతున్నారని, అమెరికా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఆసుపత్రులు దాదాపు ఇదే సమస్యను ఎదుర్కుంటున్నాయని తెలుస్తోంది.

అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికాలో వైద్య సదుపాయాల కొరత రావడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని, ఎన్నో దేశాలకు వైద్య సదుపాయాలు అందిస్తూ, ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవాలని సలహాలు ఇస్తున్న ఆంటోని ఫౌచీ లాంటి మేధావులు అమెరికాలో పరిస్థితులను అంచనా వేయలేక పోతున్నారా, అమెరికాలో నెలకొన్న ఈ పరిస్థితులు అగ్ర రాజ్యానికి తీరని అవమానం తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు పరిశీలకులు.

Attachments Area .

ఎన్నికలవేళ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు..!!