రిపబ్లికన్ పార్టీకి షాక్.. ఫ్లోరిడా జీవోపీ ఛైర్మన్ జీగ్లెర్‌పై అత్యాచార ఆరోపణలు, రాజీనామాకు డిమాండ్
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ రిపబ్లికన్ పార్టీ( Republican Party )కి గట్టి షాక్ తగిలింది.
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఫ్లోరిడా ఛైర్మన్ , ఆ పార్టీలో కీలక నేతల్లో ఒకరైన క్రిస్టియన్ జీగ్లర్‌పై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి.
ప్రస్తుతం సరసోటా పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది.ఈ ఏడాది ప్రారంభంలో క్రిస్టయన్ జీగ్లర్ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ట్రంప్ సన్నిహిత వర్గాలు ఆయనను ఉత్తమ ఎంపికగా పేర్కొన్నాయి.జీగ్లర్( Christian Ziegler )పై వచ్చిన అభియోగాలను ఆయన న్యాయవాది డెరెక్ బైర్డ్ నవంబర్ 30న ధృవీకరించారు.
జీగ్లర్‌పై వచ్చిన అభియోగాలపై సరసోటా పోలీస్ డిపార్ట్‌మెంట్ విచారణ జరుపుతోందని.వారికి ఆయన పూర్తిగా సహకరిస్తున్నారని డెరెక్ చెప్పారు.
జీగ్లర్ నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన ఆకాంక్షించారు. """/" /
నేరారోపణల ప్రకారం .
గత మూడేళ్లుగా ఫ్లోరిడా జీవోపీ ఛైర్మన్ , అతని భార్య బ్రిడ్జేట్ జిగ్లర్( Bridget Ziegler )లు మరో మహిళతో "consensual Three-way Sexual Relationship"లో వున్నారు.
ఈ క్రమంలో అక్టోబర్ 2న సరసోటా( Sarasota )లో అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి సరసోటా పోలీస్ డిపార్ట్‌మెంట్ నివేదికను అందించింది.
ఈ ఆరోపణల నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఫ్లోరిడా ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందిగా క్రిస్టియన్ జీగ్లర్‌ను గవర్నర్ రాన్ డిసాంటిస్ డిమాండ్ చేశారు.
"""/" /
జార్జియాలో జరిగిన మీడియా సమావేశంలో డిసాంటిస్ మాట్లాడుతూ.దర్యాప్తును ఆయన ఎలా ఎదుర్కొంటాడో తనకు తెలియడం లేదని, అందువల్ల పదవి నుంచి తప్పుకోవాలని సూచించారు.
అతను దోషిగా తేలే వరకు నిర్దోషేనని గవర్నర్ వ్యాఖ్యానించారు.మరోవైపు ఫ్లోరిడా డెమొక్రాటిక్ పార్టీ ఛైర్‌వుమెన్ నిక్కీ ఫ్రైడ్( Nikki Fried ) తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు.
అవి రాజకీయ ప్రయోజనాల కోసం చేసినవని, రహస్య ఎజెండాను కలిగి వున్నాయని ఆమె ఆరోపించారు.
క్రిస్టియన్ జీగ్లర్ వంటి శక్తివంతమైన నేతకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసిన ఆమె ధైర్యాన్ని తాను అభినందిస్తున్నానని నిక్కీ పేర్కొన్నారు.
నేరపూరిత ఆరోపణలపై సరసోటా పోలీస్ డిపార్ట్‌మెంట్ క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోందని తాను విశ్వసిస్తున్నట్లు ఆమె చెప్పారు.
నో ప్రాబ్లమ్.. కాల్ మీ ఆంటీ.. వైరల్ అవుతున్న తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు!