భారతీయ విద్యార్ధులకు అమెరికా వర్సిటీ బంపర్ ఆఫర్...!!

భారత్ నుంచీ వివిధ దేశాలకు ఉద్యోగాల నిమిత్తం ఎలాగైతే నిపుణులు వలసలు వెళ్తారో అలాగే భారత్ నుంచీ ఉన్నత చదువుల కోసం వెళ్ళే విద్యార్ధులు కూడా అత్యధికంగా ఉంటారు.

భారత విద్యార్ధుల ప్రతిభా పాటవాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుసు కాబట్టే అమెరికా ప్రభుత్వం కూడా భారతీయ విద్యార్ధులకు రెడ్ కార్పెట్ పరుస్తుంది ఎందుకంటే భవిష్యత్తులో అమెరికా అభివృద్ధిలో భారతీయ విద్యార్ధులు భాగస్వాములు అవుతారనే కోణంలో వారికి అక్కడి వర్సిటీలలో చదువుకునే అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారు.

అయితే కేవలం అమెరికా మాత్రమే కాదు కెనడా, సింగపూర్, అరబ్ దేశాలు సైతం భారతీయ విద్యార్ధులకు రాయితీలు కల్పిస్తూ తమవైపు ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తుంటాయి.

ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఫ్లోరిడా అట్లాంటిక్ వర్సిటీ భారతీయ విద్యార్ధులకు భంపర్ ఆఫర్ ప్రకటించింది.

భారత్ నుంచీ వచ్చే విద్యార్ధులకు తమ వర్సిటీ ఉపకారవేతనాలు అందిస్తుందని వారికి చదువు విషయంలో ఆర్ధిక భారం పడకుండా సాయం చేస్తామని ప్రకటించింది.

వచ్చే విద్యా సంవత్సరం తమ వర్సిటీలో చదువుకోవాలని భావించే అంతర్జాతీయ విద్యార్ధులు ఎవరైనా సరే వారికి ఉపకార వేతనాలు అందిస్తామని తెలిపింది.

"""/"/ ఈ ఉపకార వేతనాలు నాలుగేళ్ళు లేదా ఎనిమిది సెమిస్టర్స్ పాటు అందుతాయని వారి విద్యా ఏడాది పూర్తయ్యేలోగా ఒక్కో విద్యార్ధికి 24వేల డాలర్లు అందుతుందని పేర్కొంది.

అయితే ఈ ఉపకార వేతనం అందాలంటే ప్రతీ విద్యార్ధి తప్పకుండా మే 1 నాటికి తమ దరఖాస్తు పూర్తి చేయాలని జీపిఏ స్కోర్ అమెరికా గ్రేడింగ్ స్కోర్ స్కేల్ పై కనీసం 3.

5 నుంచీ 4 వరకూ స్కోర్ ఉండాలి.అన్ని అర్హతలు సమానంగా ఉంటె అర్హతలు పొందిన వారి వివరాలు తెలియజేస్తామని వర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది.

అండర్ గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న విద్యార్ధులకు పలు అంతర్జాతీయ ఉపకార వేతనాలు పొందే అర్హత కూడా ఉందని తెలుస్తోంది.

వీడియో: పందిని చంపేద్దాం అనుకున్న చిరుతపులి.. ఊహించని షాక్‌తో తల్లడిల్లింది..?