ఖమ్మం జిల్లాకు నిధుల వరద.. రూ.100 కోట్లు కేటాయింపు

ఖమ్మం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నిధులను మంజూరు చేసింది.పది రోజుల క్రితమే జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు గానూ కేసీఆర్ సర్కార్ రూ.

690 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే.తాజాగా ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి కోసం మరోసారి నిధులు కేటాయించింది.

ఈ మేరకు ఇవాళ మరో రూ.100 కోట్లను మంత్రి కేటీఆర్ మంజూరు చేశారు.

అనంతరం మంత్రిగా నాలుగేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రి పువ్వాడకు ఈ మేరకు జీవో కాపీని మంత్రి కేటీఆర్ అందించారు.

కాగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వినతితో నిధులను మంజూరు చేశారు.ఈ క్రమంలో ప్రజల తరపున మంత్రి పువ్వాడ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.

అయితే తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిధులు మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఓజీ సినిమాతో అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్నారా.. రామ్ చరణ్ జవాబు ఇదే!