డీఎస్సీకి దరఖాస్తుల వెల్లువ:ఒక్క పోస్టుకు 25,మంది పోటీ
TeluguStop.com
హైదరాబాద్:జూన్ 22 తెలంగాణలో వచ్చేనెల 17వ తేదీ నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నా యి.
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షకు 2,79,956 మంది అభ్యర్థులు దరఖా స్తు చేసుకున్నారు.
ఒక్క పోస్టుకు సుమారు 25 మంది పోటీ పడుతున్నట్లు సమాచారం.మొత్తం 11,062 పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
డీఈడీ, బీఈడీ పూర్తి చేసి టెట్ ఉత్తీర్ణులైనవారు ఎస్జీటీ, ఎస్ఏ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
అలాగే బీఈడీ పూర్తి చేసి టెట్ పాసైన వారు కూడా ఎస్ఏలో రెండు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకున్నారు.
వీటిప్రకారం డీఎస్సీకి పోటీపడే అభ్యర్థుల సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని మొదట విద్యాశాఖ అంచనా వేసింది.
అధికంగా హైదరాబాద్ జిల్లా నుంచి 27, 027, నల్గొండ నుంచి 15,610 దరఖాస్తులు వచ్చాయి.
నాన్ లోకల్ కోట కింద ఇతర జిల్లా వారు కూడా హైదరాబాద్ లో పెద్దెత్తున దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో హైదరాబాద్ దర ఖాస్తు ఎక్కువ వచ్చాయి.మేడ్చల్ జిల్లాలో అతి తక్కువగా 2,265 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
దీని తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి 2,828 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన వెల్లడించారు.
ప్రభుత్వం ఇచ్చిన అవ కాశంలో 23వేల మంది ఎలాంటి ఫీజు చెల్లించకుం డానే అప్లయ్ చేసుకున్నట్లు తెలిపారు.
14 ఏళ్లు అమెరికాలో ఉన్న మహిళ.. స్వదేశానికి వచ్చి ఏం చెప్పిందంటే..?