ఫ్లైట్ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌.. టేకాఫ్ చేయ‌న‌న్న పైలెట్.. కార‌ణం తెలిస్తే షాక్‌

P Style="text-align: Center;"చాలామంది డ్యూటీల విష‌యంలో చాలా చాలా ర‌కాలుగా ఉంటారు.కొన్ని స‌ర్వీసుల రంగాల్లో ప‌నిచేసే వారు మాత్రం మాన‌వ‌తా దృక్ఫ‌థంతో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

అంతేగానీ నా డ్యూటీ టైమ్ అయిపోయింది నేను చేయ‌ను అంటే మాత్రం కుద‌రదు.

ఎందుకంటే వారి సేవ‌లు అత్యంత అవ‌స‌రం.ఇక విమ‌నాం న‌డిపే పైల‌ట్ కూడా క‌చ్చితంగా డ్యూటీ టైమ్‌కు వెళ్లిపోతానంటే కుద‌ర‌దు.

క‌చ్చితంగా డ్యూటీ టైమింగ్  కాకుండా కొన్ని అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఎక్కువ స‌మ‌యం కూడా ప‌నిచేయాల్సి ఉంటుంది.

/p ఇలా ప‌ని చేయ‌కుండా మొండికేస్తే మాత్రం చివ‌ర‌కు ప్ర‌యాణికుల ఆగ్ర‌హానికి గురి కాక త‌ప్ప‌దు.

అయితే ఇప్పుడు కూడా ఓ ఫైలెట్ ఇలాగే చేసి చివ‌ర‌కు ప్ర‌యాణికులతో చివాట్లు పెట్టించుకున్నాడు.

ప్ర‌యాణం మ‌ధ్య‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసిన అత‌ను.ఆ త‌ర్వాత మాత్రం టేకాఫ్ చేయ‌లేదు.

పాకిస్తాన్ కు చెందిన పైలెట్ ఆదివారం విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా ఫ్లైట్‌ను న‌డుపుతుండ‌గా.

ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు బాగో లేవ‌ని ఇస్లామాబాద్ వెళ్లాల్సిన విమానాన్నిసౌదీలో ల్యాండింగ్ చేశాడు.

అయితే ఆ త‌ర్వాత మాత్రం త‌న డ్యూటీ టైమింగ్ అయిపోయింద‌ని, తాను టేకాఫ్ చేయ‌లేనంటూ చెప్పాడు.

అంతే ప్ర‌యాణికులు మొత్తం అత‌ని మీద సీరియ‌స్ అయ్యారు.చివ‌ర‌కు పై అధికారులు రంగంలోకి దిగి అత‌నికి క్లాస్ పీకారు.

ఇక ప్రయాణికులను ద‌గ్గ‌ర‌లోని హోటల్‌లోనే బస చేయించారు.ఇక పైలెట్ ను విశ్రాంతి తీసుకుని త‌ర్వాత డ్యూటీ ఎక్క‌డ‌మ‌ని చెప్పారు.

ఈ విష‌యాన్ని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి అధికారికంగా వెల్ల‌డించారు.ఎవ‌రు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని వెల్ల‌డించాడు.

అయితే ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.దీని మీద అనేక కామెంట్లు వినిపిస్తున్నాయి.

US Airport : యూఎస్ ఎయిర్‌పోర్ట్‌లోని ఈ బ్యాగేజీల గజిబిజి చూశారా.. వీడియో వైరల్..