ఏలూరు జిల్లాలో ఫ్లెక్సీల రగడ..!

ఏలూరు జిల్లాలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.విజయరాయిలో ఫ్లెక్సీలను టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేయగా చింతలపూడిలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి.

నవ్వే మా ఖర్చ అంటూ వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటైయ్యాయి.దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.