ఆ గింజ‌లు తింటే మొటిమ‌లు ద‌రిచేర‌నే చేర‌వ‌ట‌..తెలుసా?

మొటిమ‌లు.కోట్ల మందిని ప్ర‌ధానంగా వేస్తున్న చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో దీనిదే అగ్ర స్థానం.

కాలుష్యం, హార్మోన్ ఛేంజ‌స్‌, పోష‌కాల కొర‌త, ఆహార‌పు అల‌వాట్లు, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే ప్రోడెక్ట్స్‌ను వినియోగించ‌డం, స్కిన్ కేర్ లేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మొటిమ‌లు వ‌స్తుంది.

దాంతో వాటిని త‌గ్గించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే మొటిమలు వ‌చ్చాక బాధ ప‌డ‌టం కంటే రాకుండా ముందే జాగ్ర‌త్త ప‌డటం చాలా ఉత్తమం.

అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి ఆ ఆహారాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.

అవిసె గింజ‌లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అవిసె గింజ‌ల్లో ఉండే ప్రోటీన్స్‌, విట‌మిన్స్‌, ఫైబ‌ర్ మ‌రియు ఇత‌ర పోష‌క విలువ‌లు ఆరోగ్యానికే కాకుండా చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచ‌డంలోనూ అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

ముఖ్యంగా మొటిమ‌లు ద‌రి చేర‌కుండా చేయ‌డంలో ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.రోజుకు రెండు స్పూన్ల అవిసె గింజ‌ల‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మొటిమ‌లు రాకుండా ఉంటాయి.

ఒక‌వేళ మొటిమ‌లు ఉన్న పోతాయి.అలాగే గుమ్మడికాయను కూడా చ‌ర్మానికి చాలా లాభాల‌ను అందిస్తుంది.

అయితే చాలా మంది గుమ్మ‌డికాయను ఎవైడ్ చేస్తారు.కానీ, త‌ర‌చూ గ‌మ్మ‌డికాయ జ్యూస్ లేదా కూర‌ల రూపంలో తీసుకుంటే మొటిమ‌లు రాకుండా ఉంటాయి.

మ‌రియు వృద్ధాప్య ఛాయ‌లకు కూడా దూరంగా ఉండొచ్చు. """/"/ బంగాళ‌దుంప సైతం మొటిమ‌లు అడ్డు క‌ట్ట వేయ‌గ‌ల‌దు.

త‌ర‌చూ ప‌రిమితి మించ‌కుండా బంగాళ‌దుంప‌ల‌ను తీసుకుంటే.అందులో ఉండే విటమిన్ ఎ, రెటినోల్ వంటి పోష‌కాలు మొటిమ‌లు రాకుండా ర‌క్షిస్తాయి.

మ‌రియు ఉన్న మొటిమ‌ల‌ను త్వ‌ర‌గా నివారిస్తాయి.ఇక మొల‌కెత్తిన విత్త‌నాలు కూడా మొటిమ‌ల‌ను ద‌రి చేర‌నివ్వ‌వు.

రోజూ మొల‌కెత్తిన విత్త‌నాలను తీసుకుంటే.వాటిలో ఉండే విట‌మిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంపొందిస్తాయి.

అదే స‌మ‌యంలో మొటిమ‌లు రాకుండా ఆపుతాయి. .

వైరల్ వీడియో: బైక్‌ని ఢీకొట్టిన కారు.. ఒక్కసారిగా బైకుపై వెళ్తున్న ఆ దంపతులు..?