అటుకులు తింటే షుగర్ వ్యాధి వస్తుందా..తెలుసుకోండి?
TeluguStop.com
అటుకులు.వీటినే పోహా అని కూడా పిలుస్తుంటారు.
వరి ధాన్యం నుంచి అటుకులతో మన భారతీయులు ఎన్నో రకాల వంటలు చేస్తారు.
ముఖ్యంగా అటుకుల పులిహోర, అటుకుల ఉప్మా, అటుకుల పొంగలి, అటుకుల కట్ లైట్, అటుకుల పాయసం, అటుకుల దోసె, మసాలా అటుకులు ఇలా అనేక రకాల రెసిపీలు తయారు చేస్తారు.
ఎలా చేసినా అటుకుల రుచి అద్భుతంగా ఉంటుంది.రుచే కాదు.
అటుకుల్లో ఆరోగ్యానికి ఉపయోగ పడే మినరల్స్, విటమిన్లు, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్లు ఇలా బోలెడన్ని పోషకాలు కూడా నిండి ఉంటాయి.
అయితే అటుకులు తింటే షుగర్ వ్యాధి వస్తుందని చాలా మంది నమ్ముతారు.ఈ క్రమంలోనే అటుకులకు దూరంగా ఉంటాయి.
మరి నిజంగా అటుకులు తింటే మధుమేహం బారిన పడతామా అంటే.ఆరోగ్య నిపుణులు మాత్రం కానే కాదంటున్నారు.
ఇది కేవలం అపోహ మాత్రమే అని.అటుకులు తింటే షుగర్ వ్యాధి వస్తుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు.
అంతేకాదు, అటుకుల్లో గ్లూకోజ్ గాని, కొవ్వు పదార్దాలు కాని అస్సలు ఉండవు.కాబట్టి, వీటిని ప్రతి రోజు తీసుకున్నా.
ఎలాంటి హాని ఉండని అంటున్నారు.పైగా అటుకులు తీసుకోవడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని చెబుతున్నారు.
ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్‌లో అటుకులను ఏదో ఒక రూపం తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
అతి ఆకలి తగ్గుతుంది.బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి అటుకులు బెస్ట్ ఫుడ్‌గా చెప్పుకోవచ్చు.
పెరుగులో కలిపి అటుకులను తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.నీరసం, అలసట సమస్యలు దూరం అవుతాయి.
అటుకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.అందుకే వీటిని తీసుకుంటే రక్త హీనత పరార్ అవుతుంది.
ఎముకలను, దంతాలను దృఢపరిచే కాల్షియం కూడా అటుకుల్లో ఎక్కువే.కాబట్టి, ఎలాంటి భయాలు, అపోహలు పెట్టుకోకుండా నిశ్చింతగా అటుకులను డైట్‌లో చేర్చుకోండి.
అమెరికా కస్టడీలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్‌కు రప్పించాలని కేంద్రం యత్నాలు